India Corona: కరోనా నుంచి కాస్త ఊరట.. తగ్గిన కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న యాక్టివ్‌ కేసులు..

| Edited By: Anil kumar poka

Jun 14, 2022 | 5:48 PM

Corona updates: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే అంతకుముందు రోజుతో పోల్చితే సోమవారం కొత్త కేసులు 18 శాతం మేర తగ్గాయి.

India Corona: కరోనా నుంచి కాస్త ఊరట.. తగ్గిన కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న యాక్టివ్‌ కేసులు..
Corona Virus
Follow us on

Corona updates: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే అంతకుముందు రోజుతో పోల్చితే సోమవారం కొత్త కేసులు 18 శాతం మేర తగ్గాయి. గత మూడు రోజులుగా 8 వేలకుపైగా నమోదైన కేసులు నిన్న 6 వేలకు దిగొచ్చాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెల్లడించింది. నిన్న 3.21 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 6,594 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజు మూడు శాతం దాటిన పాజిటివిటీ రేటు తాజాగా 2.05 శాతానికి తగ్గడం కాస్త ఊరటనిచ్చే విషయం. కొత్త వారితో కలిపి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.32 కోట్ల మందికి పైగా కొవిడ్‌ బారినపడ్డారు. గత 24 గంటల వ్యవధిలో 4,035 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది.

ఆ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు..

ఇవి కూడా చదవండి

కాగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొవిడ్ వైరస్‌ అంతం కాలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ హెచ్చరించారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 50 వేల మార్కును దాటాయి. ప్రస్తుతం దేశంలో 50,548 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డేటా ప్రకారం, రోజువారీ ఇన్‌ఫెక్షన్ రేటు 2.05 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.32 శాతంగా ఉంది. ఇక ఈ వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,26,61,370కి చేరుకుంది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటివరకూ 195 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Believe it or not : చనిపోయిన తర్వాత కూడా వెంట్రుకలు, గోర్లు పెరుగుతాయా? ఇందులో ఎంత మేర నిజముందంటే..

On This Day: 40 ఓవర్లలో 45 పరుగులు.. ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత బోరింగ్‌ మ్యాచ్‌..

Viral Video: అట్లుంటది మరి మనతో దోస్తీ అంటే.. మెట్లెక్కేందుకు స్నేహితునికి సాయం.. నెటిజన్లను ఫిదా చేస్తోన్న పప్పీ వీడియో..