India Coronavirus Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. తాజాగా 20 వేల మార్క్ దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,431 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 318 మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో కేరళలో 12,616 కేసులు నమోదు కాగా.. మరణాలు134 నమోదయ్యాయి.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,94,312 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,49,856 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 24,602 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,00,258 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,44,198 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దీంతోపాటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 92,63,68,608 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో 43,09,525 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 14,31,819 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 57,86,57,484 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
India reports 22,431 fresh COVID-19 cases, 24,602 recoveries, and 318 deaths in the last 24 hours
Active cases: 2,44,198 Total recoveries: 3,32,00,258 Death toll: 4,49,856 Total cases: 3,38,94,312
Vaccination: 92,63,68,608 (43,09,525 in last 24 hours) pic.twitter.com/5jJXWBK33O
— ANI (@ANI) October 7, 2021
Also Read: