AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kolkata Murder Case: ఇలాంటి అఘాయిత్యాలను ఇప్పటికైనా ఆపండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కోల్‌కతాలో జరిగిన సంఘటనపై రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేస్తూ, మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజంలోనూ అనుమతించలేమని రాష్ట్రపతి అన్నారు. సమాజం కూడా నిజాయితీగా, న్యాయంగా ఉండేందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలి.

Kolkata Murder Case: ఇలాంటి అఘాయిత్యాలను ఇప్పటికైనా ఆపండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Droupadi Murmu
Balaraju Goud
|

Updated on: Aug 28, 2024 | 4:37 PM

Share

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఎంతో వేదనకు గురిచేసిందని, విషయం తెలిసి భయపడ్డానని వార్తా సంస్థ PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. భారతీయ కూతుళ్లపై ఇలాంటి ఆకృత్యాలను ఏ నాగరిక సమాజం సహించదన్నారు. ఇప్పటికైనా ఈ దుర్మార్గాలను ఆపాలని ఆమె పిలుపునిచ్చారు.

కోల్‌కతాలో జరిగిన సంఘటనపై రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేస్తూ, మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజంలోనూ అనుమతించలేమని రాష్ట్రపతి అన్నారు. సమాజం కూడా నిజాయితీగా, న్యాయంగా ఉండేందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలి. 2012లో ఢిల్లీ నిర్భయ కేసు మరువక ముందే.. దేశంలో లేక్కలేనన్ని అఘాయిత్యాలు జరుగుతుండటం బాధకరం అన్నారు. కోలకతా లో జరిగిన మరో అత్యంత దారుణమైన, హేయమైన చర్య అని రాష్ట్రపతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కొందరు వ్యక్తులు స్త్రీలను తక్కువగా, తక్కువ శక్తిమంతులుగా, తక్కువ సామర్థ్యం ఉన్నవారుగా, తక్కువ తెలివిగలవారుగా చూస్తారు. కూతుళ్లు, అక్కాచెల్లెళ్లపై ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదు. ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవారు స్త్రీలను ఒక వస్తువుగా చూస్తారు. భయం నుండి విముక్తి పొందేందుకు వచ్చే అడ్డంకులను తొలగించడం మన ఆడపిల్లల కర్తవ్యం అని రాష్ట్రపతి తెలిపారు. నిర్భయ తర్వాత గత 12 ఏళ్లలో జరిగిన లెక్కలేనన్ని అత్యాచారాలను సమాజం మరచిపోయిందని, ఈ సామూహిక స్మృతి సరికాదని ఆమె అన్నారు. చరిత్రను ఎదుర్కోవడానికి భయపడే సమాజాలు సామూహిక విస్మృతిని ఆశ్రయిస్తాయి. భారతదేశం చరిత్రను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రాష్ట్రపతి. సమాజం కొన్ని కఠినమైన ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కూతుళ్లు, అక్కాచెల్లెళ్లపై ఇలాంటి అఘాయిత్యాల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆగస్టు 9న జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం..

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీ చేస్తున్న జూనియర్ డాక్టర్‌పై ఆగస్టు 9న అత్యాచారం జరిగింది. ఆ తర్వాత జూనియర్ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. వైద్యురాలి ముఖం, శరీరంపై గాయాలు కనిపించాయి. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల అలసత్వం కారణంగా కలకత్తా హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. వైద్యుల భద్రతకు సంబంధించి చట్టం చేయాలనే డిమాండ్‌ చేస్తున్నారు. కోల్‌కతా కేసుకు వ్యతిరేకంగా బెంగాల్‌తోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..