పాకిస్థాన్‌లో కూలిన భారత యుద్ధ విమానం! వైరల్ అవుతున్న వీడియో.. అసలు నిజమేంటి?
భారత్-పాకిస్తాన్ మధ్య వివాదం నేపథ్యంలో, ఒక భారతీయ రాఫెల్ యుద్ధ విమానం కూలిపోయిందని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడిన నకిలీ వీడియో అని తేలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఉంది. అయితే రెండు దేశాల మధ్య వివాదం ఇప్పటికీ దౌత్య స్థాయిలో కొనసాగుతోంది. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వల్ల తమకు కలిగిన అపారమైన నష్టాలను దాచిపెట్టుకోవడానికి పాకిస్తాన్ అనేక అబద్ధాలు ప్రచారం చేస్తోంది. భారత రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది, కానీ దీనికి ఇంకా ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలను అందించలేదు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, దీనిలో ఒక ఫైటర్ జెట్ నివాస ప్రాంతంలోని ఇంటిపైకి దూసుకెళ్లడం చూడవచ్చు. జెట్ మంటల్లో ఉంది, పొగ బయటకు రావడం కనిపిస్తుంది. అలాగే, సమీపంలో పెద్ద జనసమూహం గుమిగూడింది. జెట్ పై భారత జెండా కూడా కనిపిస్తుంది.
వైరల్ వీడియో వెనుక ఉన్న నిజం ఎంత?
వైరల్ అవుతున్న వీడియో నిజం కాదని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా సృష్టించబడిన వీడియో తేలింది. అయితే ఈ వీడియో ఆధారంగా భారతీయ మీడియా మాత్రమే కాకుండా అనేక విదేశీ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి. ఈ వైరల్ వీడియో మే 8, 2025న యూబ్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్లు ఉంది. ఈ వీడియోలో కూడా వైరల్ క్లిప్ లాగా సమీపంలో ఒక గుంపు, అనేక ఇళ్ళు కనిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోలో మండుతున్న జెట్ విమానంలోని ఒక భాగం అకస్మాత్తుగా వింతగా విడిపోతుంది. దీన్ని చూస్తే ఈ వీడియో AI ఉపయోగించి తయారు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




