AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోడ్డు పేరును బ్రహ్మోస్ మార్గ్‌గా మార్చండి.. ప్రధాని మోదీకి వాణిజ్య సంఘం లేఖ!

ఢిల్లీలోని ముస్తఫా కెమాల్ అటాతుర్క్ మార్గ్ పేరును బ్రహ్మోస్ మార్గ్‌గా మార్చాలని చాంబర్ ఆఫ్ ట్రేడ్ &ఇండస్ట్రీ (CTI) భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో చాంబర్ ఆఫ్ ట్రేడ్ &ఇండస్ట్రీ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ రోడ్డు ప్రధాని మోదీ నివాసానికి సమీపంలో ఉండడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పవచ్చు.

ఆ రోడ్డు పేరును బ్రహ్మోస్ మార్గ్‌గా మార్చండి.. ప్రధాని మోదీకి వాణిజ్య సంఘం లేఖ!
The Chamber Of Trade
Anand T
|

Updated on: May 19, 2025 | 7:06 PM

Share

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించిన తర్వాత భారత్ దానికి ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి సుమారు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఆ తర్వాత భారత్‌ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి. ఈనేపథ్యంలో ఉగ్రచర్యకు పాల్పడిన పాకిస్తాన్‌ను టర్కీ మద్దతు ఇస్తూ వచ్చింది. దీంతో టర్కీ బహిష్కరణకు భారత్ పిలుపునిచ్చింది. ఇదే క్రమంలో భారత రాజధాని ఢిల్లీలో టర్కీ వ్యస్థాపకుడు పేరుతో ఉన్న ముస్తఫా కెమాల్ అటాతుర్క్ మార్గ్ పేరును బ్రహ్మోస్ మార్గ్‌గా మార్చాలని చాంబర్ ఆఫ్ ట్రేడ్ &ఇండస్ట్రీ ప్రధానికి కోరింది.

రోడ్డుకు బ్రహ్మోస్ పేరు ఎందుకు పెట్టాలి?..

ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన సైనిక చర్యలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి బ్రహ్మోస్ క్షిపణులను (సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి) ఉపయోగించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ క్షిపణి భారత సాయుధ దళాల శక్తిని ప్రతిబింబిస్తుందని, దేశభక్తిని పెంపొందిస్తుందని CTI పేర్కొంది.

టర్కీ వ్యవస్థాపకుడు అటాతుర్క్ పేరిట ఉన్న రోడ్డు సైన్‌బోర్డ్ 30 ఏళ్లుగా ఉందని, కానీ ఇటీవల టర్కీ చర్యలు ముఖ్యంగా పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం భారతీయుల్లో అసంతృప్తిని కలిగించాయని సీటీఐ లేఖలో తెలిపింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ వైఖరిని ఖండిస్తూ, “పాకిస్తాన్‌తో పాటు టర్కీ కూడా శత్రువు దేశంగా భావించాలని CTI పేర్కొన్నట్టు తెలుస్తోంది.

భారతదేశం టర్కీతో సంబంధాలను తెంచుకుంటోంది. ముంబై, అహ్మదాబాద్ విమానాశ్రయాలు టర్కీకి చెందిన సెలెబి కంపెనీతో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఒప్పందాలను నిలిపి వేశాయి. అదేవిధంగా, ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం కూడా సెలెబితో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో కార్యకలాపాల సంబంధాలను తెంచుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..