AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ వార్నింగ్‌..! సరిహద్దుల్లో చాలా రోజులకు ప్రశాంతంగా గడిచిన రాత్రి ఇదే..!

భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల కాల్పుల తర్వాత, శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు అంగీకరించాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్‌ తొలుత విరమణను ఉల్లంఘించినప్పటికీ, భారత ప్రతిస్పందన తర్వాత సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి.

ప్రధాని మోదీ వార్నింగ్‌..! సరిహద్దుల్లో చాలా రోజులకు ప్రశాంతంగా గడిచిన రాత్రి ఇదే..!
Pm Modi And Bsf
SN Pasha
|

Updated on: May 12, 2025 | 9:10 AM

Share

భారత్‌, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన రెండు రోజులకు జమ్మూ కశ్మీర్, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఇతర ప్రాంతాలలో రాత్రి “చాలా వరకు ప్రశాంతంగా” గడిచిందని భారత సైన్యం సోమవారం ఉదయం తెలిపింది. గత నెల 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరగడంతో భారత్‌, పాకిస్తాన్ నాలుగు రోజులుగా కాల్పులు జరిగాయి. శనివారం సాయంత్రం రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయినా కూడా పాకిస్థాన్‌ తన కుటిల బుద్ధిని చూపిస్తూ.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. అయితే.. ఈ విషయంపై భారత్‌ చాలా సీరియస్‌ అయింది.

ఇకపై పాకిస్థాన్‌ వైపు నుంచి బుల్లెట్‌ వస్తే.. మీరు మిస్సైల్‌ వదలండి అంటూ ప్రధాని మోదీ భారత సైన్యాన్ని పూర్తి స్వచ్ఛను ఇచ్చారు. దీంతో పాకిస్థాన్‌ ఆదివారం రాత్రి సైలెంట్‌ అయిపోయింది. శనివారం సాయంత్రం 5 గంటల నుండి తక్షణమే అమల్లోకి వచ్చేలా భూమి, వాయు, సముద్రంపై అన్ని కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని భారత్‌, పాక్‌ ఒక అవగాహనకు వచ్చాయి. అయితే, కొన్ని గంటల తర్వాత, శ్రీనగర్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలతో సహా జమ్మూ కశ్మీర్‌లోని వివిధ ప్రదేశాలలో డ్రోన్‌లను గుర్తించి అడ్డగించాయి. పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని, అందుకు భారత సాయుధ దళాలు తగిన విధంగా స్పందిస్తున్నాయని భారత్‌ రాత్రిపూట విలేకరుల సమావేశంలో తెలిపింది.

ఆ వెంటనే ప్రధాని మోదీ కూడా అమెరికా ఉపాధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడుతూ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో పాకిస్థాన్‌ వెనక్కి తగ్గింది. సరిహద్దుల్లో కాల్పులను పూర్తిగా నిలిపివేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఘోరమైన దాడికి సరిహద్దు సంబంధాలను కనుగొన్న తర్వాత భారత్‌ మే 7న ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించి, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.