AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 13 మంది మృతి, 30 మందికి గాయాలు!

ఛత్తీస్‌గడ్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి ప్యాసింజర్ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. సుమారు 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు నలుగురు చిన్నారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా రాయ్‌పూర్‌-బలోద బజార్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 13 మంది మృతి, 30 మందికి గాయాలు!
Anand T
|

Updated on: May 12, 2025 | 10:40 AM

Share

పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. వారితో పాటు నలుగురు చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌ -బలోదబజార్‌ రోడ్డులోని సారగావ్‌ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారు జామున జరిగినట్టు తెలుస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. చటౌడ్ గ్రామానికి చెందిన కొందరు తమ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో పాల్గొనడానికి చౌతియా ఛత్తీ గ్రామానికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే వివాహం పూర్తయ్యాక ఓ వాహనంలో రాయ్‌పూర్‌కు బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనం బలోదబజార్‌ రోడ్డులోని సారగావ్‌ సమీపంలోకి రాగానే వేగంగా వచ్చిన ఓ ట్కక్కు ఆ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు.

సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలతో పాటు గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక మృతుల్లో తొమ్మిది మంది మహిళలతో పాటు నలుగు చిన్నారులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయ్‌పుర్‌ ఎస్పీ లాల్‌ ఉమ్మెద్‌ సింగ్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం