AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రక్కసికి అమ్మమ్మ.. ఎబోలా వైరస్‌‌పై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..

ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వేళ భారత్ హై అలర్ట్ ప్రకటించింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి హైరిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టిన కేంద్రం.. జ్వరం, తలనొప్పి, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరించింది. WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ను కట్టుదిట్టం చేశారు.

కరోనా రక్కసికి అమ్మమ్మ.. ఎబోలా వైరస్‌‌పై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
Ebola Virus
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: May 21, 2026 | 4:59 PM

Share

ఆఫ్రికాలో ఎబోలా కల్లోలం ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. ఇప్పటికే ఎబోలాతో 100 మంది వరకు చనిపోగా.. వందలాది మంది వ్యాధి బారినపడటంతో భారత్‌లోనూ హై అలర్ట్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలో, భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆరోగ్య సలహా జారీ చేసింది.

ముఖ్యంగా ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాలైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి హై-రిస్క్ దేశాల నుండి వచ్చే లేదా ఆయా దేశాల గుండా ప్రయాణించి భారతదేశానికి చేరుకునే ప్రయాణికులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎబోలా లక్షణాలు కనిపిస్తే తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.

* తీవ్రమైన జ్వరం – తలనొప్పి

* శరీరంపై నీరసం లేదా అలసట, కండరాల నొప్పులు

* వాంతులు – విరేచనాలు

* గొంతు నొప్పి లేదా కారణం తెలియకుండా శరీరం నుండి రక్తస్రావం కావడం

ఎబోలా అనుమానిత లేదా ధృవీకరించబడిన రోగి రక్తం లేదా శారీరక ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే విమానాశ్రయంలోని హెల్త్ డెస్క్ లేదా ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్‌కు తక్షణమే నివేదించాల్సి ఉంటుంది.

భారతదేశంలో అడుగుపెట్టిన 21 రోజుల వ్యవధిలో పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలని.. తమ ట్రావెల్ హిస్టరీ నీ ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని కేంద్రం హెచ్చరించింది.

ప్రస్తుతానికి భారతదేశంలో ఎబోలా కేసులు ఏవీ నమోదు కానప్పటికీ, ప్రయాణికుల భద్రత మరియు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల దృష్ట్యా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రక్రియకు అందరూ సహకరించాలని అధికారులు కోరారు. ముందస్తు జాగ్రత్తల ద్వారానే ఈ ప్రమాదకర వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోగలమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఎబోలా అనుమానిత కేసు గుర్తిస్తే వెంటనే అరికట్టడంతో పాటు వ్యాధి వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎబోలా వైరస్ నిర్ధారణకు పూణె NIV ల్యాబ్‌లో పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వదంతులు నమ్మొద్దని ప్రజలకు సూచించింది.

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింన డబ్ల్యూహెచ్ఓ..

దేశంలో ఎబోలా వ్యాప్తి లేనప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణాలు, ప్రపంచ అనుసంధానం కారణంగా భారత్ అంటువ్యాధుల ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎయిమ్స్ డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశానికి ఎబోలా ముప్పు తక్కువగానే ఉందన్నారు. గతంతో పోలిస్తే దేశంలో పటిష్ఠమైన విమానాశ్రయ స్క్రీనింగ్ వ్యవస్థలు, వ్యాధి నిఘా యంత్రాంగాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ప్రపంచంలో ఎక్కడైనా అంటువ్యాధులు ప్రబలితే అవి దేశంలోని వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. కరోనా లాగా ఎబోలా వ్యాపించదని ఆఫ్రికన్ అధికారులు చెబుతున్నారు. WHO కూడా ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సో.. బీ అలర్ట్ అంటూ ప్రజల్ని హెచ్చరిస్తోంది కేంద్రం..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us