AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ రూటులో నాటో చీఫ్.. నోరు అదుపులో పెట్టుకోవాలని భారత విదేశాంగశాఖ వార్నింగ్‌!

భారత్‌పై అమెరికా సుంకాలు విధించిన తరువాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి ఉక్రెయిన్‌ యుద్ద వ్యూహంపై చర్చించారన్న నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే వ్యాఖ్యలను విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. మార్క్‌ రుటె మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. నాటో చీఫ్‌ మార్క్‌ రుటే కూడా ట్రంప్‌ దారిలో పయనిస్తున్నారు. భారత్‌ మాత్రం దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేస్తోంది.

ట్రంప్ రూటులో నాటో చీఫ్.. నోరు అదుపులో పెట్టుకోవాలని భారత విదేశాంగశాఖ వార్నింగ్‌!
Narendra Modi, Mark Rutte,vladimir Putin
Balaraju Goud
|

Updated on: Sep 26, 2025 | 9:13 PM

Share

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మధ్య ఫోన్‌కాల్‌పై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే చేసిన వ్యాఖ్యలను విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని భారత్‌ హెచ్చరించింది. అమెరికా విధించిన సుంకాలు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని, నష్ట నివారణలో భాగంగా పుతిన్‌కు మోదీ ఫోన్‌ చేసి, ఉక్రెయిన్‌ యుద్దంలో అనుసరిస్తున్న వ్యూహంపై చర్చించినట్టు నాటో చీఫ్‌ మార్క్‌ రుటే అన్నారు.

మార్క్ రుటే వ్యాఖ్యలపై విదేశాంగశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌ అబద్దమని స్పష్టం చేసింది. బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మార్క్‌ రుటేకు సూచించింది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులపై కూడా భారత్‌ క్లారిటీ ఇచ్చింది. జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత్‌ నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టం చేసింది. తమ పౌరులకు చౌక ధరలో చమురు అందించడమే దీని ఉద్దేశమని, వీటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

అయితే, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై సుంకాల భారం పడటంతో పుతిన్ భవిష్యత్ వ్యూహాల గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని నాటో చీఫ్‌ మార్క్ రుటే వ్యాఖ్యలు చేయడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ.. పుతిన్‌తో ఆ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదని.. అలాంటి సంభాషణ ఏదీ జరగలేదంటూ భారత్‌ క్లారిటీ ఇచ్చింది. రష్యా నుంచి భారత్‌ , చైనా ముడిచమురు దిగుమతుల చేసుకోవడంతో ఆ దేశానికి ఆర్ధిక వనరులు చేకూరుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదే పదే ప్రస్తావిస్తున్నారు. నాటో చీఫ్‌ మార్క్‌ రుటే కూడా ట్రంప్‌ దారిలో పయనిస్తున్నారు. భారత్‌ మాత్రం దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..