AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BrahMos missile: బ్రహ్మోస్ క్షిపణులకు భలే గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు

భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులకు ప్రంపచ మార్కెట్‌లో డిమాండ్‌ భారీగా పెరిగింది. భారత్‌, పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో వాటి పనితీరును చూసిన యావత్ ప్రపంచం.. ఇప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు క్యూ కట్టాయి. దీంతో మన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణినికి డిమాండ్‌ బాగా పెరిగింది.

BrahMos missile: బ్రహ్మోస్ క్షిపణులకు భలే గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు
India's Brahmos Exports Boo
Mahatma Kodiyar
| Edited By: Anand T|

Updated on: Nov 05, 2025 | 8:05 PM

Share

ఏదైనా వస్తువు కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని విశిష్టతల గురించి ఎన్నో రకాలుగా ప్రచారం, ప్రమోషన్ చేస్తుంటారు. ఎన్ని చేసినా సరే.. దాని పనితీరు గురించి ఓ నలుగురి నుంచి ఫీడ్‌బ్యాక్ లేదా స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతగానీ వినియోగదారుడికి నమ్మకం కలగదు. ఇప్పుడు మన బ్రహ్మోస్ క్షిపణుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కొద్ది నెలల క్రితం పాకిస్తాన్‌తో భారతదేశం జరిపిన “ఆపరేషన్ సింధూర్” బ్రహ్మోస్ క్షిపణులకు టెస్ట్ డ్రైవ్ మాదిరిగా మారింది. వాటి పనితీరును యావత్ ప్రపంచం ప్రత్యక్షంగా వీక్షించింది. వాటి కచ్చితత్వం, సృష్టించిన విధ్వంసానికి వేరే ఏ సాక్ష్యం అవసరం లేదు.

ఇదే ఇప్పుడు ఆ క్షిపణికి డిమాండ్ తెచ్చి పెడుతున్నాయి. అనేక దేశాలు ఇప్పుడు ఆ క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారతదేశంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇప్పటికే.. ఫిలిప్పీన్స్‌ – భారత్ మధ్య ఒప్పందం కుదరగా, ఇప్పుడు తాజాగా ఇండోనేషియా కూడా బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు దాదాపుగా కొలిక్కివచ్చి ఒప్పందం కుదుర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోస్ ప్రత్యేకతలను ఓసారి పరిశీలిస్తే..

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రత్యేకలు

  • బ్రహ్మోస్ క్షిపణి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది ధ్వని కన్నా మూడు రెట్లు (Mach 2.8-3.0) వేగంతో ప్రయాణించగలదు.​
  • భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంలో క్షిపణి రూపకల్పన జరిగింది.​
  • నేల, సముద్రం, గాలి, జలాంతర్గాముల నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించవచ్చు.​
  • పరిధి కనీసం 290 కి.మీ నుంచి తాజాగా 650-800 కి.మీ వరకు పెంచారు; భవిష్యత్తులో 1500 కి.మీ వరకూ లక్ష్యాలను ఛేదించగలదు.​
  • ఖచ్చితత్వం: అడ్వాన్స్‌డ్ గైడెన్స్, నావిగేషన్ ద్వారా లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది.​
  • పేలోడ్: 200 కిలోలు (నేల, సముద్రం మీద నుంచి ప్రయోగిస్తే), 300 కిలోలు (విమాన ప్రయోగానికి) వార్ హెడ్ సామర్థ్యం.​
  • ‘ఫైర్ అండ్ ఫర్గెట్’ టెక్నాలజీ: ప్రయోగించిన తర్వాత మనిషి ప్రమేయం అవసరం లేదు.
  • స్టెల్త్ డిజైన్: రాడార్ ద్వారా గుర్తించటం కష్టం.​
  • ట్రిపుల్-ఫోర్సెస్ (Army, Air Force, Navy) ద్వారా ప్రయోగించగలిగే ఏకైక క్షిపణి.​
  • భూమి ఉపరితలం నుంచి కేవలం 5 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. గరిష్టంగా 14,000 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణిస్తుంది.​
  • ‘స్టీప్ డైవ్’/‘S-manoeuvre’ మోడ్: చివరి దశలో వేగంగా దిశ మార్చుకుని లక్ష్యాన్ని ఛేదించే టెక్నిక్.​
  • అన్ని వాతావరణాల్లో.. పగలు, రాత్రి సమయంలోనూ పని చేయగల సామర్థ్యం.​

ఫిలిప్పీన్స్‌తో ₹3500 కోట్ల ఒప్పందం

కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం ఫిలిప్పీన్స్‌తో సుమారు ₹3500 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రకారం క్షిపణులు, అవసరమైన ఇతర ఆయుధ వ్యవస్థలను అందిస్తుంది. ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయంగా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే, ఈ ప్రాంతంలో తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఫిలిప్పీన్స్ తమ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది.

క్యూ లైన్లో ఇంకా చాలా దేశాలు

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి కోసం అనేక దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇండోనేషియా చాలా కాలంగా చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది జనవరిలో ఇండోనేషియాకు చెందిన అత్యున్నత రాజకీయ, సైనిక నాయకత్వం న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో బ్రహ్మోస్ గురించి చర్చించింది. తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ ఆ దేశానికి మరింత నమ్మకాన్ని కలిగించింది.

మరోవైపు భారతదేశం ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు క్షిపణులను విక్రయిస్తోంది. ఈ ప్రత్యేకమైన ఆయుధ వ్యవస్థ మార్కెట్‌ను ఇప్పుడు మరింత విస్తరించాలని భారత్ భావిస్తోంది. ఇటీవల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సహా సీనియర్ భారత సైనికాధికారులు ఇండోనేషియాను సందర్శించారు. CDS ఇండోనేషియా పర్యటన భారతదేశం – ఇండోనేషియా మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాన్ని సూచిస్తుంది. జనవరిలో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేపట్టిన భారత పర్యటన కూడా భారత్ – ఇండోనేషియా సైన్యాల మధ్య సన్నిహిత సహకారానికి మార్గాన్ని సుగమం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.