AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Broken Rice: రైతులకు గుడ్‌న్యూస్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. నూకల ఎగుమతికి గ్రీన్ సిగ్నల్..

భారతదేశం 150కి పైగా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో సగటు వర్షపాతం తక్కువగా ఉండడంతో వరిసాగు విస్తీర్ణం తగ్గింది. అటువంటి పరిస్థితిలో దేశీయ సరఫరాను పెంచడానికి దేశంలోని పౌరులకు బియ్యం కొరత లేకుండా..

Broken Rice: రైతులకు గుడ్‌న్యూస్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. నూకల ఎగుమతికి గ్రీన్ సిగ్నల్..
Broken Rice
Sanjay Kasula
|

Updated on: Oct 14, 2022 | 7:18 AM

Share

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతులకు ఉపశమనం కలిగించే వార్తను అందించింది. నూకల ఎగుమతికి అనుమతి ఇచ్చింది. పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. కొంతమందికి బ్రోకెన్ రైస్ ఎగుమతి చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 8 సెప్టెంబర్ 2022 నుండి దేశంలో బ్రోకెన్ రైస్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 8కి ముందు జారీ చేసిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సి) మద్దతుతో 3,97,267 టన్నుల విరిగిన బియ్యాన్ని(నూకల) రవాణా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమాచారాన్ని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. గత నెల ప్రారంభంలో విరిగిన బియ్యం ఎగుమతిని నిషేధిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఎగుమతికి అనుమతి..

కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటీసులో 3.97 లక్షల టన్నుల విరిగిన బియ్యాన్ని(నూకల) ఎగుమతి చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 8కి ముందు బ్రోకెన్ రైస్ ఎగుమతిపై అనుమతులు తీసుకున్న వారికి ప్రభుత్వం ఎగుమతి ఉపశమనం కల్పించింది. దీంతో వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 8కి ముందు తీసుకున్న నిర్ణయం..

8 సెప్టెంబర్ 2022లోపు ఒప్పందం కుదుర్చుకున్న లేదా ఆర్డర్ చేసిన నూకలను కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేయవచ్చని పేర్కొంది. అయితే.. ప్రభుత్వం ఎగుమతి చేయడానికి గడువు 31 మార్చి 2023 అంటే మీరు వచ్చే ఏడాది మార్చి నెలలోపు ఎగుమతి చేయవచ్చు.

దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బ్రోకెన్ రైస్ ఎగుమతిపై నిషేధం పెట్టింది. అయితే, బియ్యం ఎగుమతిపై నిషేధం పరిధిని మరింత పొడిగించవచ్చు. వివిధ రకాల బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చైనా తర్వాత భారతదేశం వరిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం. ప్రపంచ బియ్యం వ్యాపారంలో 40 శాతం వాట భారత్‌దే. పారా బాయిల్డ్ రైస్ మినహా బాస్మతీయేతర బియ్యంపై ప్రభుత్వం 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ సరఫరాను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం