IT returns: ఆదాయపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఐటీ రిటర్న్ ఫైలింగ్ గడువు పెంపు!

కొత్త ఐటీ పోర్టల్‌లో సమస్యల కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, గడువు తేదీని మరోసారి పొడిగించే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

IT returns: ఆదాయపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఐటీ రిటర్న్ ఫైలింగ్ గడువు పెంపు!
It Returns
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 29, 2021 | 4:11 PM

Income Tax returns filling: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు సంబంధించి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇటీవల గడువును పొడిగించింది. అయితే, కొత్త ఐటీ పోర్టల్‌లో సమస్యల కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, గడువు తేదీని మరోసారి పొడిగించే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త ఐటీ వెబ్ సైట్‌లో ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా సెప్టెంబర్ 15వ తేదీ వరకు సిద్ధం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరో 15 రోజులపాటు ఐటీ రిటర్న్స్ చేసేందుకు వీలు కలుగవచ్చని భావిస్తున్నారు.

సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఐటీ వెబ్ సైట్ సిద్ధం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో, పదిహేను రోజుల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీ నాటికి కోట్లాది మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇబ్బందులు పడతారు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించే అవకాశముంది. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపుకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో కేంద్రం నుండి ఓ ప్రకటన రావొచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే సాంకేతిక సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి మరింత సమయం అవసరం. దీంతో గడువు పొడిగింపు తప్పనిసరి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి ఇబ్బందులు రాకుండా గడువు పెంచే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే, గత నాలుగు రోజుల్లో 4 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని, ఆగస్ట్ 21వ తేదీ నుండి వరుసగా రెండు రోజులు పని చేయలేదని చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 80 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని, ఆర్థిక సంవత్సరం 2020తో పోలిస్తే ఇది 14 శాతం మాత్రమే ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. కొత్త పోర్టల్‌లో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు సంబంధించి రోజువారీ డేటాతో సీబీడీటీ ముందుకు రానుందని తెలుస్తోంది.

మరోవైపు, ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్ సాంకేతిక సమస్యలను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి పరిష్కరించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌కు ఇటీవల సూచించారు. ఈ సాంకేతిక ఇబ్బందుల పైన ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి, ఆందోళనను తెలియజేసింది. అన్ని సాఫ్టువేర్ ఇబ్బందులు తొలగించేందుకు ఇరవై రోజులకు పైగా గడువును ఇచ్చింది. కొత్త ఐటీ పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలను చర్చించేందుకు గత సోమవారం సలీల్ పరేఖ్‌తో సమావేశమయ్యారు.

కాగా, ఈ కొత్త వెబ్ సైట్ జూన్ 7వ తేదీన ప్రారంభమైంది. అప్పటి నుండి రూ.4241 కోట్లు ఖర్చు చేశామని, నాటి నుండి నేటి వరకు సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండున్నర నెలలుగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వెబ్ సైట్ సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు తమ టీం ప్రయత్నిస్తోందని సలీల్ పరేఖ్ చెప్పారు. 750 మందికి పైగా సిబ్బంది ఐటీ శాఖ వెబ్ సైట్ పైన పని చేస్తున్నారన్నారు. ఇన్ఫోసిస్ సీఈవో ప్రవీణ్ రావు వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు సలీల్ పరేఖ్.

ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్‌లో రెండున్నర నెలలుగా సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ గడువును మళ్లీ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఐటీ రిటర్న్స్ గడువు జూలై 31వ తేదీ వరకు ఉంటుంది. అయితే వివిధ అంశాల నేపథ్యంలో గడువును సెప్టెంబర్ 30వ తేదీకి పొడిగించారు. కొత్త పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నందున, ట్యాక్స్ పేయర్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇబ్బందిపడుతున్నందున మరోసారి పొడిగించవచ్చునని నిపుణులు కూడా భావిస్తున్నారు. గతంలో టీసీఎస్ సంస్థ ఎంసీఏను బాగా హ్యాండ్లింగ్ చేసిందని, ప్రస్తుతం పాస్ పోర్ట్ ఆపరేషన్స్‌ను నిర్వహిస్తోంది. కొత్త ట్యాక్స్ పోర్టల్ అసైన్‌ను టీసీఎస్‌కు హ్యాండిల్ చేసి, ఏడాది సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే, పాత ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌ను రిస్టోర్ చేయాలని పేర్కొన్నారు. దివ్యేష్ జైన్ ఈ ట్వీట్‌ను కూడా రీట్వీట్ చేస్తూ, పాత ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌ను రిస్టోర్ చేయాలన్నారు.

Read Also…  Bride Slaps Groom: పెళ్లి పీటలపైనే వరుడి చెంప చెల్లుమనించిన వధువు.. ఇంతకీ పెళ్లి కూతురి కోపానికి కారణమేంటో తెలుసా?