AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bride Escaped: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానంటూ పెళ్లి వివాహ వేదిక నుంచి జంప్..

UP Bride Escaped: యూపీలో పెళ్లి పీటల మీద నుంచి వధువు తప్పించుకుని పారిపోయింది. చిటికెన వేలు పట్టుకుని ఏడు సార్లు అగ్నిహోత్రం చుట్టు..

Bride Escaped: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానంటూ పెళ్లి వివాహ వేదిక నుంచి జంప్..
Bride Escaped
Shiva Prajapati
| Edited By: Team Veegam|

Updated on: Apr 12, 2021 | 9:36 PM

Share

UP Bride Escaped: యూపీలో పెళ్లి పీటల మీద నుంచి వధువు తప్పించుకుని పారిపోయింది. చిటికెన వేలు పట్టుకుని ఏడు సార్లు అగ్నిహోత్రం చుట్టు ప్రదిక్షణలు చేయకుండానే.. టాయిలెట్ పేరు చెప్పి ఒంటిపై ఉన్న నగలతో సహా ఉడాయించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. యువతి కుటుంబ సభ్యులు సహా.. పెళ్లి తంతు నిర్వహించే పండిట్ వరకూ అంతా మోసానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పరిధిలో గల మోదీనగర్‌లో నివసిస్తున్న యువకుడికి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. అయితే యువతిని పెళ్లి చేసుకోవాలంటే లక్ష రూపాయల ఎదురు కట్నం ఇవ్వాలని షరతు పెట్టారు. దానికి అంగీకరించిన యువకుడి కుటుంబ సభ్యులు.. పెళ్లి వేడికలో లక్ష రూపాయలు ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు.. పార్తపూర్‌లో భదబ్రాల్ గ్రామంలోని ఆలయంలో యువతి, యువకుడికి వివాహ ఏర్పాట్లు చేశారు. వారి వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు నడుస్తోంది.

అయితే ఒప్పందంలో భాగంగా వరుడి కుటుంబం నుంచి యువతి కుటుంబానికి పెళ్లి వేదికపైనే లక్ష రూపాయలు ముట్టాయి. ఆ సమయంలో వధువు, వరుడు కలిసి పెళ్లి వేదికపై ఉన్న అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అప్పటికి నాలుగు ప్రదక్షిణలు చేశారు. ఇంతలో వరుడి కుటుంబం నుంచి డబ్బు అందడంతో.. వధువు తన నాటకాలు మొదలు పెట్టింది. వాష్‌రూమ్‌కి వెళ్లివస్తానంటూ వేదిక నుంచి వెళ్లిన యువతి అటు నుంచి అటే ఉడాయించింది. ఒంటిపై ఉన్న నగలతో సహా, వారు ఇచ్చిన లక్ష రూపాయలు తీసుకుని పారిపోయింది. యువతి పారిపోయిందనే విషయం తెలియగానే వివాహ వేదిక వద్ద ఉన్న పురోహితుడు, యువతి తల్లిదండ్రులు సైతం అక్కడి నుంచి పారిపోయారు.

దాంతో వరుడి కుటుంబ సభ్యులు సహా వివాహానికి హాజరైన బంధువు కంగుతిన్నారు. తాము మోసపోయామనే విషయాన్ని గ్రహించిన బాదితులు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లుగా వారికి వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తప్పించుకుపోయిన యువతి సహా.. ఆమె తల్లిదండ్రులు, పురోహితుడి కోసం గాలిస్తున్నారు. వధువు ఫోన్ నెంబర్ ఆధారంగా వారిని ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Also read: Bank Robbery: రక్షణగా ఉన్న గార్డ్ దోచేశాడు..ఏక్సిస్ బ్యాంకులో భారీ చోరీ..సీసీ కెమెరాలతో విషయం వెలుగులోకి!

Corona Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్కులు పెట్టుకుంటేనే కరోనా తీవ్రతను సమర్ధంగా అడ్డుకోగలం..అమెరికా పరిశోధనల్లో వెల్లడి

66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో