Trending: పిల్లల్ని మార్చుకున్న అన్నాదమ్ముళ్లు.. కారణం తెలిస్తే ఔరా అనాల్సిందే.. అసలు కథేంటంటే..
దంపతులకు పిల్లలు కలగకపోతే.. దత్తత తీసుకోవడం మనకు తెలిసిందే. తెలిసిన వాళ్లో, బంధువుల దగ్గర నుంచో.. అదీ లేకుంటే అనాథ శరణాలయాల నుంచి లీగర్ ప్రాసెస్ చేసి మరీ పిల్లల్ని దత్తత తీసుకుంటారు..
దంపతులకు పిల్లలు కలగకపోతే.. దత్తత తీసుకోవడం మనకు తెలిసిందే. తెలిసిన వాళ్లో, బంధువుల దగ్గర నుంచో.. అదీ లేకుంటే అనాథ శరణాలయాల నుంచి లీగర్ ప్రాసెస్ చేసి మరీ పిల్లల్ని దత్తత తీసుకుంటారు. వారికి రక్షణ కల్పిస్తామన్న భరోసా కల్పించిన తర్వాతే.. న్యాయపరంగా చిన్నారులను అప్పగిస్తుంటారు. ఇక.. బంధువుల విషయానికి వస్తే.. అన్నా దమ్ముళ్లు, అక్కా చెల్లెళ్ల పిల్లలు అందరి దగ్గర కలిసి పెరుగుతుంటారు. కుటుంబంలో ఉన్నవారందరితో వారికి ఆప్యాయతానురాగాలు ఉంటాయి. తాజాగా.. మహారాష్ట్రలో అరుదైన సంఘటన జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమను చాటుకుంటూ ఆదర్శ అన్నదమ్ములుగా నిలిచారు.
అవును.. పెళ్లయిన దంపతులెవరైనా సంతానం కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. తమ ఇంట ఆడ పిల్ల పుట్టాలని కొందరు, అబ్బాయి పుట్టి వంశాన్ని నిలపాలని కొందరు కోరుకుంటారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని షెగాల్ గ్రామానికి చెందిన బిరుదేవ్ మానే, అప్పాసో మానే అన్నదమ్ములు. బిరుదేవ్ మానేకు ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. ఐదేళ్ల క్రితం కుమారుడు జన్మించగా, రెండేళ్ల క్రితం మళ్లీ కుమారుడే పుట్టాడు. అప్పాసోకు మొదటి బిడ్డగా పాప పుట్టింది. రెండు నెలల క్రితం మళ్లీ ఆడ శిశువు జన్మించింది. ఈ క్రమంలో రెండేళ్ల కుమారుడిని, రెండు నెలల ఆడ శిశువును అన్నదమ్ములు మార్చుకున్నారు.
తమ్ముడి రెండు నెలల కుమార్తెను అన్న దత్తత తీసుకున్నాడు. చిన్నారికి పేరు పెట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఔరా అనిపించాడు. బిరుదేవ్ చిన్న కుమారుడు ఆరుశ్ను అప్పాసో దత్తత తీసుకున్నాడు. దీంతో ఆడపిల్ల కావాలనుకున్న బిరుదేవ్ కోరిక, ఇటు మగపిల్లవాడు కావాలనుకున్న అప్పాసో కోరికా తీరింది. పిల్లలను ఇలా దత్తత తీసుకోవడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..