Chhattisgarh: భార్య ఊరెళ్లిందనే బ్రమలో భర్త.. కట్ చేస్తే భార్య టూర్ క్యాన్సిల్.. ఇంటికొచ్చి చూస్తే షాకింగ్ సీన్..

Chhattisgarh: తనను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు, అతని ప్రేయసికి ఓ రేంజ్‌లో చుక్కలు చూపించింది భార్య.

Chhattisgarh: భార్య ఊరెళ్లిందనే బ్రమలో భర్త.. కట్ చేస్తే భార్య టూర్ క్యాన్సిల్.. ఇంటికొచ్చి చూస్తే షాకింగ్ సీన్..
Man
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 15, 2022 | 6:10 AM

Chhattisgarh: తనను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు, అతని ప్రేయసికి ఓ రేంజ్‌లో చుక్కలు చూపించింది భార్య. వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని.. బడితపూజ చేసింది. అంతటితో శాంతించని ఆ మహిళ.. భర్తను, ఆ మహిళ అర్థ నగ్నంగా ఊరేగించింది. జూన్ 11న ఛత్తీస్‌గఢ్‌లోని కొండగవాన్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండగవాన్‌కు చెందిన వ్యక్తి(25)కి ఓ యువతితో పెళ్లి అయ్యింది. పెళ్లికి ముందు నుంచే అతనికి మరో యువతితో అక్రమ సంబంధం ఉంది. అయితే, తాజాగా తన భార్య ఊరెళ్లిందని భావించిన అతను.. తన ప్రేయసిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపారు. అయితే, అతని భార్య ఊరుకు వెళ్లకుండా తిరిగి వచ్చింది. ఇంట్లో యువతితో తన భర్త ఉండటాన్ని గమనించిన ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే తన బంధువులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. వారు అక్కడికి చేరుకుని.. భర్త, అతని ప్రేయసిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ చితకబాదుడు బాదారు. అర్థనగ్నంగా గ్రామంలో ఊరేగించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళను అవమానించారనే కారణంగా సదరు వ్యక్తి భార్య, ఆమె బంధువులపై పోలీసులు కేసు పెట్టారు.