Assam: శివుని వేషధారణలో నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. చివరికి సీఎం జోక్యంతో..
Assam: మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడనే కారణంతో శివుని వేషధారణ ధరించి నిరసన వ్యక్తం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Assam: మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడనే కారణంతో శివుని వేషధారణ ధరించి నిరసన వ్యక్తం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అస్సాంలోని నాగోన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. బిరించి బోరా(38), దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ధరలను నిరసిస్తూ శివుడి వేషధారణ ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిరుధ్యోగానికి వ్యతిరేకంగా వీధి నాటకం వేస్తూ నిరసన వ్యక్తం చేశాడు. అయితే, ఈ చర్యను తీవ్రంగా భావించిన బీజేపీ శ్రేణులు సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువులు మనోభావాలను దెబ్బతీసిన సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శివుని వేషధారణలో ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, అరెస్ట్ అయిన బోరాకు బెయిల్ మంజూరైందని నాగోన్ సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనోజ్ రాజవంశీ తెలిపారు.
38 ఏళ్ల బోరా శివుని వేషధారణ ధరించి..‘‘ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రజల కష్టాల కారణంగా నేను స్వర్గం నుండి దిగి రావాల్సి వచ్చింది. నిరుద్యోగ సమస్య కూడా విపరీతంగా పెరిగింది. సామాన్య ప్రజలు ఎలా బతకాలని భావిస్తున్నారు?’’ అంటూ వీధి నాటకం వేస్తూ ప్రశ్నించారు. ఇక ఇంధన ధరలు, నిరుద్యోగం తదితర సమస్యలపై నిరసనగా పార్వతీ దేవి వేషంలో ఉన్న మరో మహిళతో కలిసి బోరా బైక్‌పై వెళ్తూ ప్రచారం చేశారు.
ఇదిలాఉండగా.. ఈ అరెస్ట్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్శ స్పందించారు. ‘‘ప్రస్తుత సమస్యలపై వీధి నాటకం దైవదూషణ కాదు. అభ్యంతరకరమైన విషయాలు చెబితే తప్ప దేవతల దుస్తులు ధరించడం నేరం కాదు. నాగావ్ పోలీసులు వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది.’’ అని సీఎం పేర్కొన్నారు
Assam CM Himanta Biswa Sarma tweets, “Dressing up is not a crime unless offensive material is said. Appropriate order has been issued to Nagaon Police,” in connection with the arrest of a protestor who dressed as Lord Shiva & got bail later. pic.twitter.com/dumNbC9m5k
— ANI (@ANI) July 10, 2022