AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ బాంబు పేలుడు కేసులో పురోగతి సాధించిన పోలీసులు.. దర్యాప్తు బృందం చేతిలో పలు కీలక ఆధారాలు..?

ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ బాంబు పేలుడు కేసులో పురోగతి సాధించిన పోలీసులు.. దర్యాప్తు బృందం చేతిలో పలు కీలక ఆధారాలు..?
Balaraju Goud
|

Updated on: Jan 30, 2021 | 11:07 AM

Share

Blast near Israeli embassy : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన బాంబు పేలుడు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన దర్యాప్తు బృందం.. కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సంచరించినట్లు.. క్యాబ్‌లో వచ్చి అక్కడ దిగినట్లు గుర్తించారు. వీరికి ఈ పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే క్యాబ్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితుల ఊహాచిత్రాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద జరిగిన పేలుడులో అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ పేలుడు జరిపినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చెట్టుకు కెమెరాను అమర్చినట్లు సమాచారం. ఆ ఫుటేజీని పరిశీలించగా.. టైమ్‌ స్టాంప్‌ 1970గా ఉండడం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, అందులో రికార్డయిన దృశ్యాలు మాత్రం స్పష్టంగా లేవని సమాచారం. అలాగే మరికొంత దూరంలో సగం కాలిన గులాబి రంగు చున్నీ, ఓ ఎన్వలప్‌ను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎన్వలప్‌లో ఇజ్రాయెల్‌ రాయబారిని ఉద్దేశిస్తూ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది కేంద్ర హోంశాఖ.

Read Also… క్యూబాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తుల దుర్మరణం