మళ్లీ తిరిగివస్తా.. యూపీ పోలీసుల తీరుపై మండిపడ్డ ప్రియాంకా

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. సోన్‌భద్ర కాల్పుల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను అ్డడుకోవడం అప్రజాస్వామికమన్నారు. మీర్జాపూర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించడం నేరామా అని ప్రశ్నించారు. భూ వివాదంలో అన్యాయంగా పది మంది గిరిజనులను చంపేశారని.. బాధితులను పరామర్శించడం తన బాధ్యత అని ప్రియాంకా అన్నారు. యూపీలో అరాచకపాలన సాగుతోందని ఆరోపించారు. అయితే ఇవాళ ఉదయం చునార్‌ అతిథి గృహం వద్దకు తరలివచ్చిన […]

మళ్లీ తిరిగివస్తా.. యూపీ పోలీసుల తీరుపై మండిపడ్డ ప్రియాంకా
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 8:25 PM

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. సోన్‌భద్ర కాల్పుల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను అ్డడుకోవడం అప్రజాస్వామికమన్నారు. మీర్జాపూర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించడం నేరామా అని ప్రశ్నించారు. భూ వివాదంలో అన్యాయంగా పది మంది గిరిజనులను చంపేశారని.. బాధితులను పరామర్శించడం తన బాధ్యత అని ప్రియాంకా అన్నారు. యూపీలో అరాచకపాలన సాగుతోందని ఆరోపించారు. అయితే ఇవాళ ఉదయం చునార్‌ అతిథి గృహం వద్దకు తరలివచ్చిన బాధిత కుటుంబాలను ప్రియాంక పరామర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ బాధితులకు ఎప్పుడూ అండగా ఉంటుందని వారిని ఓదార్చారు. చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాధితులను పరామర్శించాలన్న తన లక్ష్యం నెరవేరిందన్నారు.

మరోవైపు ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకోవడం గానీ, అరెస్టు గానీ చేయలేదన్నారు మీర్జాపూర్ డీఎం. ఇప్పుడు ఆమె ఎక్కడికైనా వెళ్లొచ్చని తెలిపారు. డీఎం వ్యాఖ్యలపై ప్రియాంకా ఘాటుగా స్పందించింది. నిన్నటి నుంచి నన్ను అడ్డుకున్న పోలీసులే ఇప్పుడు అరెస్టు చేయలేదంటున్నారని.. ఎక్కడికైనా వెళ్లొచ్చంటున్నారన్నారు. వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానని.. బాధితుల్ని పరామర్శించిన నేను ఇప్పడు వెళ్తున్నాని…. కానీ మళ్లీ తిరిగి వస్తానన్నారు.

Latest Articles
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి