యూనివర్శిటీల్లో హెచ్‌సీయూ 6వ స్థానం- ర్యాంకులు ప్రకటించిన కేంద్రం

ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ర్యాంకులను ప్రకటించింది. ఇండియా ర్యాంకింగ్స్2020ను ఆ శాఖ మంత్రి రమేష్ పొఖ్రియల్ నిశాంక్ విడుదల చేశారు. మొత్తం 10 కేటగిరీల్లో ఈ ర్యాంకులను ప్రకటించారు. వర్సిటీల విభాగంలో ప్రకటించిన ఈ ర్యాంకుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 15వ ర్యాంకు దక్కగా,ఆంధ్రా వర్సిటీకి 36వ స్థానం లభించింది. ఈ విభాగంలో నెంబర్ వన్ గా బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిలిచింది. ఆ తర్వాత […]

  • Sanjay Kasula
  • Publish Date - 10:56 pm, Thu, 11 June 20
యూనివర్శిటీల్లో హెచ్‌సీయూ 6వ స్థానం- ర్యాంకులు ప్రకటించిన కేంద్రం

ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ర్యాంకులను ప్రకటించింది. ఇండియా ర్యాంకింగ్స్2020ను ఆ శాఖ మంత్రి రమేష్ పొఖ్రియల్ నిశాంక్ విడుదల చేశారు. మొత్తం 10 కేటగిరీల్లో ఈ ర్యాంకులను ప్రకటించారు. వర్సిటీల విభాగంలో ప్రకటించిన ఈ ర్యాంకుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 15వ ర్యాంకు దక్కగా,ఆంధ్రా వర్సిటీకి 36వ స్థానం లభించింది. ఈ విభాగంలో నెంబర్ వన్ గా బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జేఎన్ యూ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉన్నాయి.

కళాశాలల విభాగంలో మిరండా కాలే జ్‌ వరసగా మూడో ఏడాది తొలిస్థానంలో నిలిచింది. లా విభాగంలో హైదరాబాద్‌ నల్సార్‌ మూడో ర్యాంకు సాధించగా, ఫార్మసీ కేటగిరీలో హైదరాబాద్‌ నైపర్‌ ఐదో స్థానంలో నిలిచింది.

దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ప్రకటించడం ఇది వరుసగా ఐదోసారి కావటం విశేషం. కొత్తగా ఈసారి ర్యాంకుల కేటగిరీల్లో దంత వైద్య విభాగం కూడా చేర్చారు. ఓవరాల్‌గా, అలాగే ఇంజినీరింగ్‌ విభాగంలో ఐఐటీ–మద్రాస్‌ తొలి స్థానంలో నిలిచింది.