AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2023: ఈ బడ్జెట్‌లో పేద రైతులకు భరోసా కల్పించండి.. ఆర్థిక మంత్రికి ఓ అన్నదాత లేఖ రాస్తే?

Union Budget 2023 ఇది బడ్జెట్‌ సమయం.. ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ వర్గాలకు ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో అని, తమకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అంటూ..

Union Budget 2023: ఈ బడ్జెట్‌లో పేద రైతులకు భరోసా కల్పించండి.. ఆర్థిక మంత్రికి ఓ అన్నదాత లేఖ రాస్తే?
Finance Minister Nirmala Sitharama
Venkata Chari
|

Updated on: Jan 05, 2023 | 8:26 PM

Share

Union Budget 2023: ఇది బడ్జెట్‌ సమయం.. ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ వర్గాలకు ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు. తమకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితిలో.. ఓ అన్నదాత.. కేంద్ర ఆర్థికమంత్రికి లేఖ రాస్తే ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.

గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారూ,

నేను అప్పలనాయుడు. నేను ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా చివరలో ఉన్న ఒక గ్రామంలో నివసిస్తున్న రైతుని. నా పొలం గట్టుపై కూర్చొని సునీతతో నీకు ఈ ఉత్తరం రాయిస్తున్నాను. సునీత అంటే పదో తరగతి చదువుతున్న నా కూతురు.

నిర్మల అక్కా..

ఈరోజు నేను నిజంగా ఒత్తిడిలో ఉన్నాను. ఏదో వ్యాధి నా ఆవు ప్రాణాన్ని తీసివేసింది. మా కుటుంబం అంతా లక్ష్మీ అని పిలుచుకుంటూ ఆప్యాయంగా చూసుకునే నా ఆవు ఇప్పుడు లేదు. సాయంత్రం, లక్ష్మీ ఇంటికి వెళ్ళడానికి నాతో పాటు ఈ గట్టు మీద కూర్చునేది. లక్ష్మీకి జబ్బు చేసిన తరువాత చాలా చికిత్స చేయించాను. కానీ అది బతకలేకపోయింది. మీరే చెప్పండి ఆర్ధిక మంత్రి గారూ.. నాలాంటి చిన్న రైతుల కష్టాలు ఎందుకు తీరడం లేదు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది వరి సాగుకు మంచి ధర వస్తుందని ఆశించాం. కానీ నా కల అంతా ఆవిరైపోయింది! ఈ లేఖతో పాటు, నా పొలంలో జరిగిన నష్టానికి సంబంధించిన ఫోటోను కూడా మీకు పంపుతున్నాను.ఈ నీట మునిగిన వడ్లు ఏ మార్కెట్‌లోనూ అమ్ముడు కాలేదు. రైతులు పండించిన పంటకు మంచి ధరలు లభిస్తున్నాయని మీ అధికారులు మీకు చెబుతుండవచ్చు.

పాలు ఖరీదుగా మారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని అందరూ అంటున్నారు. కానీ అక్కా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. మీ దస్త్రాల ప్రకారం గ్రామాల్లో అంతా బాగానే ఉంది. కానీ ఇవన్నీ తప్పుడు లెక్కలు. కేవలం మీ కాగితాల మీద కనిపించే అంకెలు అంతే!

ప్రస్తుతం నా పొలంలో వరి నాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది కూడా మార్కెట్‌లో ఎరువుల కొరత వచ్చింది. మీరు లక్షలు, కోట్ల రూపాయల సబ్సిడీ అని చెబుతున్నారు. కానీ, , నేను నాలాంటి రైతులు ఇప్పటికీ ధర కంటే ఎక్కువ చెల్లించి ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రభుత్వం ఈ బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టలేదా?

పురుగు మందులు ఖరీదైనవి, ఎరువులు బోలెడు రేటు, డీజిల్ ధర ఎక్కువ. ఇలా అన్నీ మాదనిపోతున్నా.. నేను మళ్ళీ వ్యవసాయానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాను. నా రక్తం, చెమట ధారబోసి పంట పండించడానికి కష్టపడుతున్నాను. కానీ, నా చేతికి దానికి తగ్గ డబ్బు వస్తుందనే గ్యారెంటీ మాత్రం లేదు. మీరు ఈ ఉత్తరం చదివి.. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి నాకు తెలీదని అనుకోవచ్చు. తెలుసును.. కానీ అది మాకు అందుబాటులోకి రాదు అనే విషయం మీకు తెలీదనిపిస్తుంది.

మీకు తెలుసా నిర్మలక్కా..

బీమా కాగితాలపై రాసిన నిబంధనలు రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చలేవు. కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు చాలా కాలంగా ఇస్తున్నారు. ఇప్పటికీ నాలాంటి రైతులకు కేసీసీ మంజూరు కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. పైగా బ్యాంకు ఉద్యోగులు మాతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. బ్యాంకుకు వెళ్లాలంటేనే భయం పుట్టేలా పరిస్థితి ఉంది. ఇక కిసాన్ సమ్మాన నిధి ఎప్పుడూ సరిపోదు.

ఇప్పుడు ద్రవ్యోల్బణం పేరుతో అన్ని ధరాలూ వేడెక్కిపోయాయి. మలాంటి వారికి ఇది వేడి పాన్ మీద నీరు చిమ్మినట్లు ఉంది. నిర్మలా అక్కా.. మీ బడ్జెట్ మా వ్యవసాయ ఖర్చులను తగ్గించలేదా? అయినా చిన్న అనుమానం అక్కా.. ద్రవ్యోల్బణం ప్రకారం మా పంటల ధరలు పెరిగే అవకాశం లేదా?

నిర్మలక్కా నిజంగా సహాయం చేయగల వ్యక్తి నుంచె కదా ఏదైనా ఆశిస్తాము. నా కూతురు సునీత కూడా నిర్మలా ఆంటీ తప్పకుండా మన కోసం ఏదో ఒకటి చేస్తుందని అంటోంది. దయచేసి మమ్మల్ని నిరాశపరచవద్దు. మా ఆశలు చాలా చిన్నవి. మీరు తలుచుకుంటే తీర్చగలిగేవే. ఆ ఆశలు తీరాడానికి దయచేసి ఈ బడ్జెట్ లో సహాయం చేయండి నిర్మాలక్కా.

నీ సోదరుడు,

అప్పలనాయుడు

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...