ముక్కు నొప్పి, రక్తం కారుతుండటంతో ఆస్పత్రికెళ్లిన వృద్దుడు.. స్కాన్ చేసిన డాక్టర్లకు మైండ్ బ్లాంక్..
ఓ వృద్దుడు గత కొద్ది రోజులుగా ముక్కునొప్పితో బాధపడటమే కాదు.. ముక్కు నుంచి రక్తం వస్తుండేది. దాన్ని తగ్గించుకునేందుకు..
ఓ వృద్దుడు గత కొద్ది రోజులుగా ముక్కునొప్పితో బాధపడటమే కాదు.. ముక్కు నుంచి రక్తం వస్తుండేది. దాన్ని తగ్గించుకునేందుకు చాలానే ఆస్పత్రులు తిరిగాడు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఉపశమనం కలగకపోగా.. సమస్య మరింత తీవ్రతరం అయింది. దీంతో ఇటీవల వృద్దుడు ఓ ఈఎన్‌టీ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లగా.. ఆ వైద్యుడు స్కాన్ చేసి.. సదరు వృద్దుడి ముక్కులో జలగ ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీనగర్‌కు చెందిన 56 ఏళ్ల రాంలాల్ అనే వృద్దుడు నెల రోజులుగా ముక్కు నొప్పితో బాధపడుతున్నాడు. అంతేకాదు ముక్కులో నుంచి రక్తం కూడా వస్తుండటంతో.. ఆ బాధను తగ్గించుకునేందుకు పలు ఆసుపత్రులు తిరిగాడు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా.. ఎన్నో మందులు వాడినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. సమస్య మరింత తీవ్రతరం అయింది. దీంతో ఇటీవల ఆ వృద్దుడు స్థానికంగా ఉన్న కంబైండ్ ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నాడు. ఇక ఆ హాస్పిటల్‌లోని ఈఎన్‌టీ వైద్యుడు అతడ్ని పరీక్షించగా.. సదరు వృద్దుడు ముక్కులో ఐదంగుళాల జలగ ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఇందువల్లే వృద్దుడికి తరచూ ముక్కు నొప్పి, రక్తం కారడం లాంటివి అవుతున్నాయని గుర్తించారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి.. ఆ జలగను బయటికి తీశారు. అనంతరం వృద్దుడిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. కాగా, ప్రస్తుతం అతడి ఆరోగ్యం కుదుటపడిందని డాక్టర్లు చెప్పారు.