Covid-19 vaccine: మారుమూల ప్రాంతాలకు కోవిడ్ వ్యా్క్సిన్.. డ్రోన్ ద్వారా నిమిషాల్లోనే సరఫరా.. వీడియో..
Covid-19 vaccines Drone: కరోనావైరస్ కట్టడికి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ సంఖ్య 90 కోట్లు దాటింది. ఈ క్రమంలో మారుమూల
Covid-19 vaccines Drone: కరోనావైరస్ కట్టడికి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ సంఖ్య 90 కోట్లు దాటింది. ఈ క్రమంలో మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను పంపించాలంటే అత్యంత కష్టంగా మారింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో నివసించే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాలంటే వైద్య సిబ్బంది ఎంతో ప్రయాసతో చేరుకోవాల్సి వస్తోంది. తగినంత టెంపరేచర్‌లో వ్యాక్సిన్ నిల్వ చేయడం.. మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడం కష్టంగా మారిన తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా తరలించే ప్రక్రియను ప్రారంభించింది. దీనిలో భాగంగా రహదారులు సరిగా లేని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ సరఫరా చేసే కార్యక్రమానికి కేంద్రం సోమవారం శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ డ్రోన్లతో టీకాల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ట్విట్ చేశారు. వేగవంతమైన వ్యాక్సినేషన్‌లో భాగంగా 900డోసుల టీకాను డ్రోన్ ద్వారా తరలించినట్లు వెల్లడించారు.
వీడియో..
India’s vaccination drive besides being world’s #LargestVaccineDrive & #FastestVaccineDrive is also now #iDrone Driven#MakeInIndia drone delivered 900 vaccine doses across a distance of 31 kms in #Manipur inoculating 10 people against #COVID19 today.
— G Kishan Reddy (@kishanreddybjp) October 4, 2021
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డ్రోన్ల ద్వారా మణిపూర్‌లోని మారుమూల ప్రాంతాలకు టీకాలను సరఫరా చేశారు. బిష్ణుపూర్ జిల్లా ఆసుపత్రి నుంచి లోక్‌తక్ సరస్సు ప్రాంతంలోని కరాంగ్ దీవి వరకు టీకాలను డ్రోన్లతో సరఫరా చేశారు. ఆటోమేటిక్ మోడ్‌లో దాదాపు 31 కీలోమీటర్ల దూరంలో ఉన్న కరాంగ్ హెల్త్ సెంటర్‌కు కేవలం 15 నిమిషాల్లో డ్రోన్ చేరుకుందని అధికారులు తెలిపారు. రోడ్డు మార్గంలో ఈ ప్రాంతంలో వెళ్లాలంటే.. దాదాపు నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. వ్యాక్సిన్లను మేక్ ఇన్ ఇండియా డ్రోన్ ద్వారా సరఫరా చేయడం దక్షిణాసియాలో ఇదే మొదటిసారని ఆరోగ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో మణిపూర్‌లోని మరో రెండు జిల్లాలకు డ్రోన్‌లతో వ్యాక్సిన్‌లను సరఫరా చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశంలో ‘డ్రోన్ ఆధారిత వ్యాక్సిన్ డెలివరీ సిస్టమ్’ కోసం ఐసీఎంఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Also Read: