కులభూషణ్ కేసులో తీర్పు ఇవాళే
గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం తీర్పును వెల్లడించనుంది. ఆయనను మార్చి 3, 2016లో పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ చేసింది. ఆ తర్వాత పాక్ మిలటరీ న్యాయస్థానం ఏప్రిల్ 11, 2017లో మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే పాక్ వైఖరికి వ్యతిరేకంగా భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జాదవ్ కేసులో తుది తీర్పు వెల్లడించనున్నందున పాక్ న్యాయ బృందం […]
గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం తీర్పును వెల్లడించనుంది. ఆయనను మార్చి 3, 2016లో పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ చేసింది. ఆ తర్వాత పాక్ మిలటరీ న్యాయస్థానం ఏప్రిల్ 11, 2017లో మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే పాక్ వైఖరికి వ్యతిరేకంగా భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
జాదవ్ కేసులో తుది తీర్పు వెల్లడించనున్నందున పాక్ న్యాయ బృందం ఒకరోజు ముందుగానే నెదర్లాండ్‌లోని హేగ్ నగరానికి చేరుకుంది. అక్కడకు చేరుకున్న పాక్ బృందంలో ఆదేశ విదేశాంగ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్, పాక్ అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్ ఉన్నారు. ఈ తీర్పు హేగ్ కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు, అంటే మన కాలమానం ప్రకారం సాయంత్రం 6 గం.లకు వెలువరించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది.