డుమ్మా కొట్టే మంత్రులపై మోదీ ఫైర్.. లిస్ట్ ఇవ్వాలంటూ ఆదేశాలు

మంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు మంత్రులు సరిగా హాజరుకావడం లేదంటూ మోదీ ఫైర్ అయ్యారు. మంత్రులకు ఇంకా ఆయా శాఖలపై పట్టు రాలేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌కు రాని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని మోదీ ఆదేశించారు. ఈ రోజు సాయంత్రానికల్లా ఆ మంత్రుల పేర్లు తనకు ఇవ్వాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని, పార్లమెంట్ వ్యవహారాల శాఖల మంత్రిని ఆదేశించారు. ఇవాళ జరిగిన బీజేపీ […]

డుమ్మా కొట్టే మంత్రులపై మోదీ ఫైర్.. లిస్ట్ ఇవ్వాలంటూ ఆదేశాలు
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2019 | 4:43 PM

మంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు మంత్రులు సరిగా హాజరుకావడం లేదంటూ మోదీ ఫైర్ అయ్యారు. మంత్రులకు ఇంకా ఆయా శాఖలపై పట్టు రాలేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌కు రాని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని మోదీ ఆదేశించారు. ఈ రోజు సాయంత్రానికల్లా ఆ మంత్రుల పేర్లు తనకు ఇవ్వాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని, పార్లమెంట్ వ్యవహారాల శాఖల మంత్రిని ఆదేశించారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాని కేంద్రమంత్రుల గురించి ఆరా తీశారు.

పార్లమెంట్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కేబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం.. మరికొంతమంది తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడు గానీ సభలో లేకపోవడంపై మోదీ మండిపడ్డారు. రాజకీయాలకు ఆతీతంగా ఎంపీలు పని చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచించారు. దేశంలో అనేక చోట్ల ఏర్పడిన నీటి ఎద్దడి గురించి ప్రస్తావించిన ఆయన.. జల్ అభియాన్ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఈ నేపథ్యంలో ఈ ఎద్దడిని తీర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీబీ, కుష్టు వంటి వ్యాధులు ప్రభలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కూడా ఎంపీలకు హితవు పలికారు.

Latest Articles
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)