పాకిస్తాన్ గగనతలంపై భారత విమానాలు.. నిషేధం ఎత్తివేత
తన గగనతలంపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఫిబ్రవరి-14, 2019న కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేసి 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నదానికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో.. పాకిస్తాన్ తన గగనతలంపై భారత విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. దీంతో భారతదేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానాలను రూటు మార్చవలసి వచ్చింది. అనంతరం ఐదు నెలల […]
తన గగనతలంపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఫిబ్రవరి-14, 2019న కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేసి 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నదానికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో.. పాకిస్తాన్ తన గగనతలంపై భారత విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. దీంతో భారతదేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానాలను రూటు మార్చవలసి వచ్చింది. అనంతరం ఐదు నెలల తర్వాత తమ గగనతలాన్ని గతంలో ప్రచురించిన ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ మార్గాల్లో మంగళవారం నుంచి అన్ని రకాల విమానాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. దీంతో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. పాక్ తన గగనతలాన్ని మూసివేయడం వల్ల విమానయాన సంస్థలకు రూ.491 కోట్ల నష్టం వాటిల్లింది. పాక్ గగనతలం మూసివేతలో ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్‌కు రాకపోకలు సాగించే ఇండిగో విమాన సర్వీసును కూడా రద్దు చేశారు.