ఆధార్‌తో ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించండి : ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
ఎన్నికల్లో బోగస్ ఓట్ల ఏరివేత ఎన్నిసార్లు జరిపినా మళ్లీ మళ్లీ అదే సమస్య వస్తూనే ఉంది . దీనిపై బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం ఎన్నికల విధానంలో లోపాలున్నాయని, అందువల్ల ఆధార్‌తోనే ఎన్నికలు జరిపాలని ఆయన పిటిషన్‌లొ కోరారు. ఎన్నికల సమయంలో ఓటర్ల డేటాను భద్రపరచడం, వారికి తగిన […]
ఎన్నికల్లో బోగస్ ఓట్ల ఏరివేత ఎన్నిసార్లు జరిపినా మళ్లీ మళ్లీ అదే సమస్య వస్తూనే ఉంది . దీనిపై బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం ఎన్నికల విధానంలో లోపాలున్నాయని, అందువల్ల ఆధార్‌తోనే ఎన్నికలు జరిపాలని ఆయన పిటిషన్‌లొ కోరారు.
ఎన్నికల సమయంలో ఓటర్ల డేటాను భద్రపరచడం, వారికి తగిన గుర్తింపు కార్డులు ఇవ్వడం వంటివి అధికారులకు పెద్ద సవాళ్లుగా మారాయని పిటినర్ పేర్కొన్నారు. ఈ ఓటింగ్ ప్రవేశపెట్టడం ద్వారా ఓటర్ల వేలిముద్రలు, ఫేస్ రికగ్నైజేషన్ వంటి వాటితో ఓటు వేయవచ్చని కూడా తన పిటిషన్‌లో తెలిపారు. ఈ విధానాన్ని పాటిస్తే నకిలీ, బోగస్ ఓట్లు లేకుండా చేయవచ్చని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రతి ఎన్నికల సమయంలో ఆయా సమాచారాన్ని క్రమబద్దీకరిస్తే సరిపోతుందని పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ తెలిపారు. ఇదే విషయంపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే ఫలితం లేదనందునే కోర్టును ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు.
ఆధార్ ఆధారంగా ఓటింగ్ నిర్వహించే విధానాన్ని పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సూచించింది. అలాగే దీని సాధ్యాసాధ్యాలపై 8 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కోర్టు.