సుప్రీంకోర్టు విచారణల లైవ్ టెలికాస్ట్ ? పరిశీలిస్తున్నామన్న సీజేఐ ఎన్.వి. రమణ, ప్రతిపాదనపై ఏకాభిప్రాయాన్ని సాధిస్తామని వెల్లడి

సుప్రీంకోర్టు ప్రొసీడింగులను (విచారణలను) లైవ్ టెలికాస్ట్ చేయాలన్న ప్రతిపాదనను తాము చురుకుగా పరిశీలిస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణ తెలిపారు.

సుప్రీంకోర్టు విచారణల లైవ్ టెలికాస్ట్ ? పరిశీలిస్తున్నామన్న సీజేఐ ఎన్.వి. రమణ,  ప్రతిపాదనపై ఏకాభిప్రాయాన్ని సాధిస్తామని వెల్లడి
N.v.ramana

సుప్రీంకోర్టు ప్రొసీడింగులను (విచారణలను) లైవ్ టెలికాస్ట్ చేయాలన్న ప్రతిపాదనను తాము చురుకుగా పరిశీలిస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణ తెలిపారు. దీనిపై కోర్టుకు చెందిన తమ సహచరులతో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధ్జించాల్సి ఉందన్నారు. మీడియా వారికి వర్చ్యువల్ గా ఈ విచారణలను కవర్ చేయడానికి సంబంధించి దీనికి అనువుగా రూపొందిన యాప్ ను ఆయన గురువారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుగా గతంలో తాను పని చేసినప్పుడు తనకు కలిగిన అనుభవాలను ఆయన గుర్తు చేశారు. రిపోర్టు చేయడంలో మీడియా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోందని, కోర్టు విచారణల తాలూకు సమాచారాన్ని జర్నలిస్టులు అడ్వొకేట్ల ద్వారా తెలుసుకోవలసి వస్తోందని ఆయన చెప్పారు. ఈ కారణంగానే కోర్టు ప్రొసీడింగులకు ప్రెస్ కూడా హాజరయ్యేందుకు అనువైన మెకానిజం ఉండాలనే అభ్యర్థన అందిందని ఆయన తెలిపారు. కొద్దికాలం పాటు తాను జర్నలిస్టుగా ఉన్నప్పుడు తమకు కారు గానీ, బైక్ సౌకర్యం గానీ ఉండేది కాదని, తాము బస్సుల్లో వెళ్లేవారమని ఆయన వెల్లడించారు. ఈవెంట్ల నిర్వాహకులు ఇచ్ఛే కన్వేయన్స్ (ప్రయాణ ఖర్చు) ను తీసుకోరాదని తమకు ఆదేశాలు ఉండేవన్నారు. కాగా ఈ యాప్ గురించి ప్రస్తావిస్తూ ఆయన స్వల్ప కాలంలోనే కోర్టు రిజిస్ట్రీ దీన్ని డెవలప్ చేయడం ముదావహమన్నారు. దీన్ని మీడియా వినియోగించుకోవాలని, కోవిడ్ ప్రొటొకాల్స్ ని జర్నలిస్టులు తప్పనిసరిగా పాటించాలని జస్టిస్ రమణ కోరారు.

ముఖ్యంగా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది.. ఇది చాలా సెన్సిటివ్…ఇందులో మొదట్లో కొన్ని లోపాలు ఉండవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడు చిన్న సమస్యలు వస్తుంటాయని, వాటిని అనవసరంగా హైలైట్ చేయరాదని కోరారు. సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ ని, మొబైల్ యాప్ ని లాంచ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇండికేట్ నోట్స్ అని వ్యవహరించే ఇది మీడియాకు ఎంతో ప్రయోజనకరమని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టుకు, మీడియాకు మధ్య వారధిగా వ్యవహరించేందుకు ఓ సీనియర్ అధికారిని కూడా నియమించే యోచన ఉందని ఆయన తెలిపారు.

కాగా కోవిద్ పాండమిక్ గురించి ప్రస్తావించిన జస్టిస్ రమణ.. 2768 మంది జ్జుడిషియల్ అధికారులు, హైకోర్టులకు చెందిన 106 మంది జడ్జీలు కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యారని చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Vaccine for Children: కలవర పెడుతున్న అధ్యయనాలు.. దూకుడు పెంచిన దేశాలు.. పిల్లలకూ కరోనా వ్యాక్సీన్..

Sri Reddy: జస్ట్ డస్ట్ బిన్…ఈసారి నేరుగా ప్రభుదేవాను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియా వేదికగా..

Click on your DTH Provider to Add TV9 Telugu