గాల్లో ఉండగానే.. హైదరాబాద్–కోల్‌కతా విమానానికి అనుకోని పరిస్థితి.. రాంచీలో అత్యవసర ల్యాండింగ్!
హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి అనుకోని పరిస్థితి ఎదురైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాన్ని రాంచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. ఈ విమానంలో కర్నూలు జిల్లాకు చెందిన 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి అనుకోని పరిస్థితి ఎదురైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాన్ని రాంచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు.
విమానంలో కర్నూలు జిల్లాకు చెందిన 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా కోల్‌కతా వెళ్లాల్సిన విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రాంచీకి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ, ప్రయాణికులు దాదాపు రెండు గంటలుగా రాంచీ విమానాశ్రయంలోనే ఎదురుచూస్తున్నారు. విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా తమ గమ్యస్థానానికి ఎప్పుడు బయలుదేరుతామో తెలియక కర్నూలుకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విమాన సంస్థ నుంచి తదుపరి సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన అనంతరం విమానాన్ని తిరిగి గమ్యస్థానానికి పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకునే విమానాన్ని రాంచీలో అత్యవసరంగా దింపినట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
