మీరు దేవుడికి పెట్టే పండే మీ అదృష్టాన్ని మార్చొచ్చట.. ఏ పండుకు ఎలాంటి ఫలితమో తెలుసుకోండి!
20 July 2026
Rajashekher
భగవంతునికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయని విశ్వాసం.
కొబ్బరికాయ – కార్యసిద్ధి
అరటిపండును నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలు నెరవేరుతాయని చెబుతారు. అదే అరటిపండును గుజ్జుగా చేసి సమర్పిస్తే రుణబాధలు తొలగుతాయని నమ్మకం.
అరటిపండు – కోరికల నెరవేర్పు, రుణ..
శనీశ్వరునికి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించి, అనంతరం వాటిని ప్రసాదంగా తీసుకుంటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని విశ్వాసం.
నేరేడు పండ్లు – శని అనుగ్రహం
ద్రాక్షపండ్లను నైవేద్యంగా సమర్పించి వాటిని పిల్లలు, పెద్దలకు పంచితే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతారు.
ద్రాక్షపండ్లు – ఆరోగ్యం, శ్రేయస్సు
మామిడి పండును నైవేద్యంగా సమర్పిస్తే ప్రభుత్వం లేదా ఇతరుల నుంచి రావాల్సిన ధనం ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుందని విశ్వాసం.
మామిడి పండు – ధనలాభం
సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే వివాహ సంబంధిత ఆటంకాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు.
సపోటా పండు – వివాహ అడ్డంకుల..
యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగుతుందని, కమలా పండును సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం.
యాపిల్, కమలా పండ్లు
పనసపండును భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తే శత్రువుల నుంచి రక్షణ లభించడంతో పాటు రోగాలు తొలగుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం. గమనిక: ఇవన్నీ హిందూ సంప్రదాయాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలు మాత్రమే.