AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సడెన్‌గా చిరుత ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే మీ వైపు అసలే రాదు..

ఇటీవల జనవాసాల్లోకి చిరుతపులులు రావడం, ప్రజలు భయాందోళనలకు గురికావడం తరచూ చూస్తూనే ఉన్నాం. సాధారణంగా చిరుతపులులు మనుషులపై దాడి చేయవు. దూరంగా ఉండటానికే ఇష్టపడతాయి. కానీ అడవుల సరిహద్దుల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో అవి అకస్మాత్తుగా ఎదురైతే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మందికి తెలియవు. దీనికి సంబంధించి అటవీ శాఖ నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు.

Krishna S
|

Updated on: Jul 20, 2026 | 3:05 PM

Share
చిరుత కళ్లముందు కనిపిస్తే మొదట చేయవలసిన పని భయపడకుండా ప్రశాంతంగా ఉండటం. చిరుతను చూసి అరుస్తూ పరుగెత్తితే, అది మిమ్మల్ని వేటగా భావించి వెంబడించే ప్రమాదం ఉంది. నెమ్మదిగా వెనక్కి కదులుతూ చిరుత కదలికలపై ఒక కన్నేసి ఉంచండి. ఎలాంటి ఆకస్మిక కదలికలు చేయకండి. మీ చేతులను పైకెత్తి, మీ జాకెట్‌ను లేదా మరేదైనా వస్త్రాన్ని వెడల్పుగా పరచి నిలబడండి. దీనివల్ల మీరు పరిమాణంలో పెద్దగా కనిపిస్తారు. చిరుత వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఇతరులతో కలిసి ఉన్నప్పుడు అందరూ దగ్గరగా ఒకే సమూహంగా నిలబడండి. సాధారణంగా గుంపుగా ఉన్న మనుషుల జోలికి రావడానికి చిరుతలు సాహసించవు.

1 / 5
ప్రయాణాలు - సమయాల్లో జాగ్రత్తలు: మీ ప్రాంతంలో చిరుత సంచారం ఉన్నట్లు తెలిస్తే, బైక్‌లపై ప్రయాణించడం పూర్తిగా మానుకోండి. కారులో ప్రయాణించడమే అత్యంత సురక్షితం. తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో లేదా రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లడం, వాకింగ్‌కు వెళ్లడం ఆపేయండి. అత్యవసరమైతే ఇద్దరు ముగ్గురితో కలిసి వెళ్లండి. పొదలు, అడవి లాంటి నిర్మానుష్య రోడ్ల వైపు వెళ్లొద్దు.

2 / 5
పిల్లలు, పెంపుడు జంతువులు: చిరుత మీ వైపు వస్తుంటే, కంగారుపడకుండా గట్టి స్వరంతో, ధీమాగా మాట్లాడండి. దాన్ని భయపెట్టడానికి చిన్నగా శబ్దాలు చేయండి. కానీ దానిపై రాళ్లు విసరడం లేదా రెచ్చగొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. మీరు పిల్లలతో ఉన్నప్పుడు చిరుత కనిపిస్తే, వెంటనే వారిని ఎత్తుకుని మీ ఒడిలో ఉంచుకోండి. వారిని అరుస్తూ పరుగెత్తనివ్వద్దు. అలాగే మీ పెంపుడు జంతువులను అదుపులో ఉంచండి, ఎందుకంటే చిరుత చూపు వాటిపై పడే అవకాశం ఎక్కువ.

3 / 5
ఒకవేళ అది వెనక్కి తగ్గుతుంటే, దానికి వెళ్లడానికి తగినంత స్థలాన్ని ఇవ్వండి. చిరుత అక్కడి నుంచి వెళ్ళిపోగానే వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోండి. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయండి. అయితే చిరుతను చూడటానికి జనాలు గుంపులు గుంపులుగా పోగవ్వకుండా చూసుకోవాలి. జనం ఎక్కువైతే చిరుత భయంతో దాడి చేసే ప్రమాదం పెరుగుతుంది.

4 / 5
మీ ప్రాంతంలో చిరుత కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా స్థానిక పోలీసులకు కచ్చితమైన సమాచారం అందించండి. వారు వచ్చే వరకు వారి సూచనలు పాటించండి. సొంతంగా చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నించడం, సెల్ఫీలు, ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి దాని దగ్గరకు వెళ్లడం ప్రాణాంతకం కాగలదు. చిరుతపులి కూడా ఒక వన్యప్రాణి. మనం ప్రశాంతంగా, తెలివిగా, జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?