AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DSP సిరాజ్ ఆన్ డ్యూటీ.. DGP సీవీ ఆనం‌ద్‌ని ఎందుకు కలిశాడంటే..?

భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీగా ఆయన కొత్త పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ ఆత్మీయ భేటీకి సంబంధించిన ఫొటోలు, సిరాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి.

DSP సిరాజ్ ఆన్ డ్యూటీ.. DGP సీవీ ఆనం‌ద్‌ని ఎందుకు కలిశాడంటే..?
Gold (3)
SN Pasha
|

Updated on: Jul 20, 2026 | 4:25 PM

Share

టీమిండియా స్టార్ బౌలర్, మన హైదరాబాదీ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ మరోసారి తెలంగాణ పోలీస్ యూనిఫామ్‌లో తళుక్కున మెరిశాడు. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సివి ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా డీజీపీగా ఆయన పదవీకాలాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ భేటీ అనంతరం సిరాజ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ సార్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఆయన పదవీకాలాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఆత్మీయ సంభాషణకు కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో ఆయన నిరంతర విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

సిరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు డీజీపీ సి.వి. ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, మహ్మద్ సిరాజ్ చూపిన మర్యాదను ప్రశంసిస్తున్నారు. అలాగే డీఎస్పీ సిరాజ్ సార్ ఆన్ డ్యూటీ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా, టీమిండియా టెస్ట్ టీమ్‌లో కీలక పేసర్‌గా కొనసాగుతున్న మహ్మద్ సిరాజ్ మైదానంలో తన ప్రదర్శనతో పాటు, సామాజిక అంశాలపై కూడా తరచూ స్పందిస్తూ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

Follow Us