ఇంట్లోనే హోటల్ టేస్ట్ వచ్చే మసాలా టీ ఇలా చేసుకోండి!
27 Sep 2026
Anand T
ఛాయ్.. ఇది లేకుండా చాలా మందికి రోజే గడవదు. అయితే ఇంట్లో చేసుకునే టీ కంటే చాలా మంది మార్కెట్‌లో దొరికే స్టాట్ టీనే ఎక్కవగా ఇష్టపడతారు.
మసాలా టీ
ఇంట్లో కూడా స్టాల్ తరహా టెస్ట్ టీ తయారు చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. కానీ అచ్చం అలాంటి టేస్ట్ మాత్రం రాదు.
మసాలా టీ
ఈ మసాల కోసం యాలకులు, నల్ల యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, సోంపు, జాజికాయ, సొంటి సిద్ధం చేసుకోండి.
మసాలా టీ
ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి పచ్చ యాలకులు, నల్ల యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, సోంపు వేసి కొద్దిసేపు వేయించండి. మాడిపోకుండా, కేవలం తేమ పోయి సువాసన వచ్చేలా దోరగా వేడి చేస్తే చాలు.
మసాలా టీ
తర్వాత సొంటి, జాజికాయలను వేయించి.. మిగతా వాటితో కలిసి అన్నింటిని మిక్సీలో వేసి పొడిగా చేయండి.
మసాటా టీ
అంతే మీ స్టాల్ టీకి కావాల్సిన మ్యాజిక్ మసాలా రెడీ అయినట్టే.. దీన్ని మీ ఇంట్లో తయారుచేసే టీలో వాడుకోవచ్చు.
మసాలా టీ
ఈ మసాలాను నీళ్లు మరుగుతున్నప్పుడు లేదా టీ పొడి వేసిన తర్వాత వేసుకొని కాసేపు బాగా మరగనివ్వండి.. అప్పుడే ఈ మసాలా ప్లేవర్ మొత్తానికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది.
మసాలా టీ
ఈ మసాలా చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువగా వేయకండి, మంచి టేస్ట్ కోసం కేవలం అర టీస్పూన్ వేస్తే చాలు.. స్టాల్ దగ్గర దొరికే టేస్ట్‌తో మీ టీ రెడీ అయినట్టే