EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ప్రతీ నెలా ఖాతాలోకి రూ.3 వేలు.. ఎలా అంటే..?
ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల నుండి రూ.25 వేలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ నుంచి ఆమోదం లభించాక ఇది త్వరలో అమల్లోకి వచ్చే అవకాశముంది. దీనివల్ల ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ఎక్కువ నిధులు జమ కానున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈపీఎఫ్ఓ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల కొత్తలా 51 లక్షల మందికి పీఎఫ్ పరిధిలోకి రానున్నారు. వారికి పీఎఫ్ అకౌంట్‌తో పాటు ఈపీఎస్ పథకం కింద పెన్షన్, జీవిత బీమా సదుపాయాలు లభించనున్నాయి. అయితే దీని వల్ల నెలవారీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరగనుండగా.. టేక్ హోం శాలరీ అనేది తగ్గనుంది. దీంతో ఉద్యోగులకు తమ శాలరీ స్లిప్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ప్రస్తుతం గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. దీంతో 12 శాతం చొప్పున అంటే రూ.1,800 పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి చందా జమ అవుతుంది. ఇప్పుడు రూ.25 వేలకు పెరగడం వల్ల 12 శాతం చొప్పున అంటే రూ.3 వేలు జమ అవుతుంది. దీని వల్ల చేతికి వచ్చే జీతం తగ్గనుండగా.. పీఎఫ్ ఖాతాలో ఎక్కువ పొదుపు జమ అవుతుంది. దీంతో భవిష్యత్ అవసరాలకు మరింత పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరుతాయి. ఇక ఉద్యోగి వాటాతో సమానంగా యజమాని కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు 12 శాతం జమ చేస్తారు. దీంతో యజమాని వాటా కూడా రూ.3 వేలకు పెరుగుతుంది. యజమాని జమ చేసే ఈ 12 శాతం మొత్తంలో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌కు వెళ్లనుండగా.. మిగిలిన మొత్తం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది.
రూ. 20 వేల వేతనం ఉన్న ఉద్యోగికి PF కాంట్రిబ్యూషన్ రూ. 3,134గా ఉంటుంది. ఇందులో ఉద్యోగి వాటా రూ. 2,400, యజమాని వాటా రూ. 734 కాగా.. యజమాని వాటా నుండి అదనంగా రూ. 1,666 EPSకు వెళుతుంది. నెలకు రూ. 35 వేలు జీతం ఉన్నవారికి తప్పనిసరి PF వాటా రూ. 6 వేలుగా ఉంటుంది. ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి పెంపునకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో ఈపీఎఫ్ఓ తన పథకంలో అవసరమైన మార్పులు చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ)కు పంపనుంది. సీబీటా ఆమోదంతో ఇది అమల్లోకి వస్తుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెంపుతో మరింతమందికి ఉద్యోగులు పీఎఫ్ పరిధిలోకి రానన్నారు. దీంతో వారికి ఆర్ధిక భద్రత దక్కనుంది. గరిష్ట వేతన పరిమితి పెంచాలని ఎప్పటినుంచో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు వారి డిమాండ్‌తో ప్రభుత్వం సానుకూల నిర్నయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
