Zomato: వామ్మో! జొమాటోలో రూ.10 వాటర్ బాటిల్‌ 100 రూపాయలా? కంపెనీ స్పందన ఏంటంటే?

బ్రయాన్ ఆడమ్స్ కాన్సర్ట్‌లో వాటర్ బాటిళ్ల విక్రయానికి సంబంధించి హైదరాబాద్ టెక్కీ ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ. 10 మాత్రమే. కానీ, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ జొమాటో అదే వాటర్ బాటిల్ ను 100 రూపాయలకు విక్రయిస్తుందని చెప్పడమే ఈ పోస్ట్ సారాంశం

Zomato: వామ్మో! జొమాటోలో రూ.10 వాటర్ బాటిల్‌ 100 రూపాయలా? కంపెనీ స్పందన ఏంటంటే?
Zomato
Follow us
Basha Shek

|

Updated on: Dec 19, 2024 | 11:31 AM

హైదరాబాద్ కు చెందిన పల్లబ్ దే ఐటీ ఉద్యోగి. ఇటీవల అతను బ్రయాన్ ఆడమ్స్ మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్ కు వెళ్లిన పల్లబ్ తన దాహం తీర్చుకునేందుకు రెండు వాటర బాటిళ్లను కొనుగోలు చేశాడట. ఇందుకు గానూ రూ. 20 ఇవ్వబోగా.. సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రూ. 200 వసూలు చేశాడట. దీంతో ఆశ్చర్యపోయిన పల్లబ్ ఈ విషయాన్ని వెంటనే ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. తాను కొనుగోలు చేసిన రెండు వాటర్ బాటిల్స్, అలాగే వీటికి సంబంధించిన డిజిటల్ ట్రాన్షక్షన్ వివరాలను అందులో జతచేశాడు. ‘నేను పాల్గొన్న ఈ ఈవెంట్ లో వాటర్ బాటిల్స్ బయట నుంచి తెచ్చుకోవడంపై నిషేధం ఉంది. ఈవెంట్ నిర్వహించే వాళ్లే వాటర్ బాటిళ్లను అమ్మతున్నారు. దీంతో జొమాటో ద్వారా ఆ వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని తెలిసింది. దాహం వేస్తుంది కదా అని రూ.10 వాటర్ బాటిళ్లను రెండింటిని కొనుగోలు చేశాను. రూ. 20 ఇవ్వబోగా.. సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రూ. 200 వసూలు చేశాడు. ఎవరూ తమ సొంత వాటర్ బాటిళ్లను తీసుకురావడానికి అనుమతించని ఈవెంట్ లో రూ. 10 వాటర్ బాటిల్ ను రూ. 100కి విక్రయించడానికి జొమాటోకి అనుమతి ఎలా వచ్చింది’ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు పల్లబ్. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గామారింది. దీనిని చూసిన నెటిజన్లు జొమాటోపై ఫైర్ అవుతున్నారు. ఇలా చేయడం దారుణమంటూ సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక పల్లబ్ దే ట్వీట్ కు జొమాటో సంస్థ కూడా స్పందించింది. ‘‘హాయ్ పల్లబ్, మీకు ఎదురైన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. మేము ఆ వాటర్ బాటిల్స్ ను విక్రయించలేదు. వాస్తవానికి మేము ఈవెంట్ నిర్వాహకులు కానప్పటికీ, టికెటింగ్ పార్ట్‌ నర్ గా ఉన్నాం. అయినప్పటికీ కస్టమర్ కు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకుంటాం’ అని జొమాటో రిప్లై ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

 వైరలవుతోన్న పోస్ట్ ఇదే..

అయితే అప్పటికే పల్లబ్ దే పోస్ట్ వైరల్ అయ్యింది. దీంతో వివిధ సందర్భాల్లో జొమాటో కారణంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను కామెంట్ల రూపంలో షేర్ చేశారు నెటిజన్లు .

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న