కట్టెల కోసం వెళ్లిన యువతి.. ఎంతకీ రాకపోవడంతో అడవిలోకి వెళ్లి చూడగా గుండె గుభేల్..!
Leopard Attack: తమిళనాడులో వేలూరు జిల్లాలో ఓ యువతిని చిరుత పులి దాడి చేసి చంపి వేసింది. అడవిలో కట్టెలు తీసుకొస్తుండగా యువతిపై పులి దాడి చేసి చంపింది. అటవీశాఖ అధికారులు కూడా చిరుతలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఆ చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు బోన్లును ఏర్పాటు చేశారు. యువతి మృతితో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
తమిళనాడులో వేలూరు జిల్లాలో చిరుతపులి దాడిలో యువతి మృతి చెందడం జిల్లావాసులను తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. అడవిలో కట్టెలు తీసుకొస్తుండగా యువతిని చిరుత ఈడ్చుకెళ్లి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వేలూరు జిల్లాలోని గ్రామాల్లో చిరుతపులుల సంచారం భారీగా ఉంది. ముఖ్యంగా బెర్ణంపేటతోపాటు చుట్టుపక్కల అడవులతో కూడిన గ్రామాల్లో చిరుతపులి సంచారం ఉందని సామాన్యులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు కూడా చిరుతల సంచారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అయినప్పటికీ చిరుతపులి సంచారం పెరుగుతూనే ఉంది. అలాగే పట్టణంలోకి చిరుతపులి వచ్చి ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో వేలూరు జిల్లాలో చిరుతపులి దాడిలో ఓ యువతి మృతి చెందింది. వేలూరు జిల్లాలోని కెవి కుప్పం ప్రాంతానికి సమీపంలోని కొల్లైమేడు గ్రామం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంది. ఆ గ్రామానికి చెందిన అంజలి (22)పై చిరుతపులి దాడి చేసింది. అడవిలో కట్టెలు తీసుకొస్తుండగా యువతిపై పులి దాడి చేసింది.
దీంతో ఆ ప్రాంత ప్రజలు కేకలు వేశారు. అంజలిని చిరుత అడవిలోకి లాగి దాడి చేసిందని స్థానికులు చెబుతన్నారు. చిరుతపులి అంజలిని చంపి అడవిలో వదిలేసింది. ఆమె శరీరమంతా రక్తపు గాయాలయ్యాయి. దీంతో ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అటవీశాఖ అధికారులు కూడా చిరుతలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. చిరుతపులి దాడిలో యువతి మృతి చెందడంతో ఆ ప్రాంత ప్రజలు నిరసనకు దిగారు. చిరుతను బంధించేందుకు బోన్లు అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. యువతి మృతితో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. Source
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి