AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కీ భాస్కర్ మాదిరి దొరికిన లాటరీ టికెట్.. తీరా చూస్తే…లక్షలు రూపాయలు పాయె..!

కేరళ లాటరీ పేరుతో హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగిని రూ.7.55 లక్షలు కోల్పోయారు. ఆమెను 'లాటరీ గెలిచారు' అని నమ్మించి మోసం చేసిన సైబర్ నేరగాళ్ళపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు 54 ఏళ్ల మహిళ కాగా, ఆమెకు ఫోన్ చేసి ‘కేరళ ప్రభుత్వ లాటరీ సంస్థ’ పేరుతో మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు.

లక్కీ భాస్కర్ మాదిరి దొరికిన లాటరీ టికెట్.. తీరా చూస్తే...లక్షలు రూపాయలు పాయె..!
Lottery Cheated
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: May 29, 2025 | 12:27 PM

Share

కేరళ లాటరీ పేరుతో హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగిని రూ.7.55 లక్షలు కోల్పోయారు. ఆమెను ‘లాటరీ గెలిచారు’ అని నమ్మించి మోసం చేసిన సైబర్ నేరగాళ్ళపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు 54 ఏళ్ల మహిళ కాగా, ఆమెకు ఫోన్ చేసి ‘కేరళ ప్రభుత్వ లాటరీ సంస్థ’ నుంచి మాట్లాడుతున్నట్టు ఒక వ్యక్తి తెలిపారు. ఆ వ్యక్తి మాట్లాడుతూ, ఒక లాటరీ డ్రా జరగబోతుందని, ఆమె పేరు ఆ లాటరీలో ఉందని, రూ. 56 లక్షలు గెలుచుకున్నట్టే అని నమ్మించారు.

మామూలుగా ప్రభుత్వ లాటరీలు వాస్తవమై ఉంటే అది అధికారిక ప్రకటన ద్వారా, నిర్దిష్ట పత్రాల ద్వారా సమాచారం అందించడం జరుగుతుంది. కానీ ఈ మోసగాళ్లు మాత్రం, ఏ విధమైన అధికారిక లాటరీ ప్రకటన లేకుండానే, బాధితురాలి వద్దకు కాల్ చేసి ‘మీరు లాటరీ గెలిచారు’ అనే మాయ మాటలతో నమ్మించారు. ఆ తర్వాత వారు ఆమెకు ఒక లింక్ పంపారు. ఆ లింక్‌లో క్లిక్ చేయమని చెప్పారు. అక్కడ ఆమెను బహుమతులు, వస్తువులు, నగదు పొందేందుకు అవసరమని తెలుపుతూ పన్నులు, ప్రాసెసింగ్ ఫీజులు వంటి తప్పుడు కారణాలతో డబ్బులు వేయాలని కోరారు.

ఆమె మొదట్లో ఆశగా, నమ్మకంగా, అందులో అసలు వాస్తవం లేదని తెలియక అడిగిన మొత్తం పంపడం మొదలుపెట్టారు. ఒక్కసారి కాదు, చకచకా కొన్ని విడతలుగా నగదును పంపారు. మొత్తం కలిపి ఆమె రూ.7.55 లక్షలు పంపారు. ఈ మొత్తం సుమారు 5-6 బ్యాంకు ఖాతాల్లోకి విడివిడిగా బదిలీ అయ్యింది. ఇలా అన్ని మల్లగుల్లగా జరిగిపోయేంత వరకూ బాధితురాలు ఇది మోసమనే విషయం గ్రహించలేదు. విషయం తెలుసుకున్న తరువాత ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, నిందితులు ఆమెకు KL324441 అనే నకిలీ టికెట్ నంబరుతో కూడిన లింక్ పంపారు. అలాగే వారు ఒక ఫోర్జరీ చేసిన లేఖను కూడా పంపారు. ఇందులో పన్నులు చెల్లించాలి అని పేర్కొన్నారు. ఈ లేఖను చూసి ఆమె పూర్తిగా నమ్మి డబ్బులు పంపింది. చట్టబద్ధమైన లేఖలలాగే చూపిస్తూ, కొన్ని అధికారం ఉన్న అధికారుల సంతకాలు, సీల్‌లు కూడా మాయ చేసి ఉంచారు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. వ ప్రజలు అలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదు. ముఖ్యంగా WhatsApp, Facebook, Instagram, Telegram వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే సందేశాలపై ఆశ ఉంచకూడదు. ఎవరైనా ‘మీరు లాటరీ గెలిచారు’, ‘మీకు బహుమతి వచ్చింది’, ‘మీ ఖాతాలో డబ్బులు జమయ్యాయి’ అనే మోసపూరిత సందేశాలు పంపితే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..