AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమించిపెళ్లాడాడు.. పరాయి మహిళల మోజులోపడి కట్టుకున్నదాన్ని కడతేర్చాడు! అత్త ఎంట్రీతో సీన్‌ రివర్స్‌

ఆమెను ఎంతో గాఢంగా ప్రేమించి.. మతం మార్చుకుని మరీ వివాహం చేసుకున్నాడు. ఇంతలో పరాయి మహిళల మోజులోపడి ప్రియమైన భార్యను ఇంట్లోనే చంపేశాడు. అనంతరం భార్య అనారోగ్యంతో మృతి చెందినట్లు..

ప్రేమించిపెళ్లాడాడు.. పరాయి మహిళల మోజులోపడి కట్టుకున్నదాన్ని కడతేర్చాడు! అత్త ఎంట్రీతో సీన్‌ రివర్స్‌
Husband Killed Wife
Srilakshmi C
|

Updated on: Jan 31, 2023 | 4:06 PM

Share

ఆమెను ఎంతో గాఢంగా ప్రేమించి.. మతం మార్చుకుని మరీ వివాహం చేసుకున్నాడు. ఇంతలో పరాయి మహిళల మోజులోపడి ప్రియమైన భార్యను ఇంట్లోనే చంపేశాడు. అనంతరం భార్య అనారోగ్యంతో మృతి చెందినట్లు ఇరుగుపొరుగును నమ్మించాడు. తమిళనాడులో చోటుచేసున్న ఈ షాకింగ్‌ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని వేదసందూరు ప్రాంతంలో వడివేలు (38) అనే వ్యక్తి 14 ఏళ్ల క్రితం ఓ ప్రైవేట్ స్పిన్నింగ్ మిల్లులో పనిచేసేవాడు. అక్కడే రంజాన్ (36) అనే మహిళతో వడివేలు ప్రేమలో పడ్డాడు. హిందూ మతంలోకి మారడానికి రంజాన్ నిరాకరించింది. దీంతో వడివేలు మతం మార్చుకుని తన పేరును మహమ్మద్ అబూబకర్ సిద్ధిఖిగా మార్చుకున్నాడు. అనంతరం రంజాన్‌ను వివాహం చేసుకుని పెరియకులం జిల్లాలోని వడకరైలోని వీఆర్పీ నాయుడు వీధిలో కాపురం పెట్టాడు. కిరాణా దుకాణం నడుపుతూ కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. మహమ్మద్‌, రంజాన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఐతే గత మూడేళ్ల నుంచి రంజాన్, మహమ్మద్‌ దంపతుల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో 2 రోజుల క్రితం రంజాన్‌ ఊపిరితీసుకోవడంతో ఇబ్బందిపడటంతో కుమార్తెలు భయంతో కేకలు వేశారు. దీంతో ఇరుగుపొరుగు చూసేటప్పటికి రంజాన్‌ మృతి చెందింది. భార్య అనారోగ్యంతో మృతి చెందినట్లు ఇరుగుపొరుగువారికి కట్టుకథలు చెప్పి, భార్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు మహమ్మద్‌.

ఐతే రంజాన్ తల్లి ఫాతిమా (70) అల్లుడిపై పెరియకుళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రంజాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొంతు నులుమడం వల్ల ఊపిరాడక మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో మహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. కిరాణా దుకాణానికి వస్తున్న మహిళలతో వివాహుతర సంబంధం పెట్టుకుని, భార్యను అడ్డుతొలగించుకున్నట్లు మోహమ్మద్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో