AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dmart Shopping Trick: డీమార్ట్‌కు వెళ్లేవారికి చాలామందికి తెలియని ట్రిక్.. ఈ టైమ్‌లో వెళితే మీకే లాభం.. ఎవరూ ఇది చెప్పరు..

డీమార్ట్‌లో ఒక్కసారైనా వెళ్లి ఉంటారు. సామాన్య, మధ్యతగరతి ప్రజలు ఎక్కువ సందర్శించే స్టోర్ ఇదే. ఇంట్లో కిరాణా సరుకుల కోసం ఎక్కువమంది ఈ మార్ట్‌కు వెళుతూ ఉంటారు. నెలకు సరిపోయేలా ఒకేసారి కిరాణా సరుకులను తెచ్చుకుంటారు. జనాల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతుంటారు.

Dmart Shopping Trick: డీమార్ట్‌కు వెళ్లేవారికి చాలామందికి తెలియని ట్రిక్.. ఈ టైమ్‌లో వెళితే మీకే లాభం.. ఎవరూ ఇది చెప్పరు..
Dmart
Venkatrao Lella
|

Updated on: Aug 18, 2026 | 12:23 PM

Share

డీమార్ట్.. ఈ పేరు తెలియనివారంటూ ఎవరు ఉండరు. నగరాల్లోనే కాదు.. ఇప్పుడు పట్టణాల్లో కూడా ఎక్కడికక్కడ డీమార్ట్‌లు కనిపిస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వెళ్లే సూపర్ మార్కెట్ ఇదే. ఏ వస్తువైనా హోల్ సేల్ ధరలకే లభించడంతో పాటు డిస్కౌంట్లు, ఆఫర్లతో చౌక ధరకే ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఇక్కడ లభిస్తుంది. దీంతో డీమార్ట్‌లు ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు షాపింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే మీరు అసౌకర్యానికి గురి కాకుండా ప్రశాంతంగా షాపింగ్ చేయాలనుకుంటే కొన్ని రద్దీ లేని రోజుల్లో వెళ్లాలి. ఏయే రోజుల్లో, ఏయే సమయాల్లో వెళితే రద్దీ తక్కుగా ఉంటుందనేది చూద్దాం.

ఈ రోజుల్లో అసలు వెళ్లవద్దు

వీకెండ్స్‌లో డీమార్ట్‌కు అసలు వెళ్లకపోవడం బెటర్. ఎందుకంటే జనాలు ఫుల్‌గా ఉంటారు. కనీసం కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండనంతలా కస్టమర్లు ఉంటారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి మధ్య కస్టమర్లు ఎక్కువగా ఉంటారు. దీని వల్ల మీరు షాపింగ్ ప్రశాంతంగా చేయలేరు. అదే సోమవారం నుంచి గురువారం వరకు రద్దీ తక్కువగా ఉంటుంది. దీంతో షాపింగ్ త్వరగా పూర్తి చేయవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా హాయిగా కావాల్సినవన్నీ కొనుగోలు చేయవచ్చు. డీమార్ట్‌కు ఉదయం వెళితే తక్కువ వినియోగదారులు ఉంటారు. స్టోర్ తెరిచిన వెంటనే వెళ్లడం వల్ల ఖాళీగా ఉంటుంది. ఉదయం జనం తక్కువగా ఉంటారు. ఇక మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య కూడా ఎక్కువ రద్దీ ఉండదు. దీంతో ఈ సమయాల్లో వెళితే మంచిది. సాయంత్రం వేళ వెళ్లకపోడమే మంచిది. ఎందుకంటే ఆఫీసులు పూర్తవుతాయి గనుక కస్టమర్లు ఎక్కువమంది వస్తుంటారు. ఇక వీకెండ్స్‌తో పాటు సెలవు రోజుల్లో వెళ్లకండి. ఇక మీరు ఆఫర్ల కోసం చూస్తుంటే.. ఒకసారి డీమార్ట్ రెడీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ధరలను పరిశీలించుకోండి. ధరలు ఏవేవి తక్కువగా ఉన్నాయనేది ముందే తెలుసుకోవడం వల్ల మాల్‌కు వెళ్లాక షాపింగ్ సులభతరం అవుతుంది.

ఆఫర్లను పరిశీలించండి..

డీమార్ట్ రెడీ యాప్‌లో ఆఫర్లను ఒక్కసారి పరిశీలించండి. ఏయే వస్తువులు అందుబాటులో ఉన్నాయి..? ఆఫర్లు ఎలా ఉన్నాయి? అనేది ముందే చెక్ చేసుకోండి. ఇక డీమార్ట్‌కు వెళ్లాలనుకున్నప్పుడు ముందే ఇంట్లోకి ఏయే వస్తువులు కావాలనేది ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. దీని వల్ల అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం అనేది తగ్గుతుంది. ఈ ఒక్క పని వల్ల మీ బిల్లు భారీగా తగ్గుతుంది.

Follow Us