Monkeys Poisoned: మానవత్వమా నీ చిరునామా ఎక్కడ.. 20 పైగా కోతులకు విషం పెట్టి చంపేసిన మనుషులు.. ఎక్కడంటే..
Monkeys Poisoned: ఓ వైపు ఏమీ తెలియని మూగజీవాలు తమ జాతి వైరాన్ని సైతం మరచి.. తోటి జంతువులకు సాయం చేస్తుంటే.. చదువు విజ్ఞానం ,మంచి-చెడుల విచక్షణ...
Monkeys Poisoned: ఓ వైపు ఏమీ తెలియని మూగజీవాలు తమ జాతి వైరాన్ని సైతం మరచి.. తోటి జంతువులకు సాయం చేస్తుంటే.. చదువు విజ్ఞానం ,మంచి-చెడుల విచక్షణ అన్నీ తెలిసిన మనిషి మాత్రం మృగంలా ప్రవర్తిస్తున్నాడు. తమ స్వార్ధానికి దేశ వ్యాప్తంగా చేస్తున్న జంతు హింసకు అంతేలేకుండా పోతుంది.. తాజాగా కర్ణాటకలోని కోలార్ వద్ద అటవీ రహదారి సమీపంలో గోని సంచుల్లో మరణించిన కోతులు కనిపించాయి. ఈ మరణించిన 20 కి పైగా కోతులు ఉండవచ్చునని.. వీటిని విషయం పెట్టి చంపేశారని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కోతులకు పోస్ట్ మార్టం నిర్వహించింది. నిందితులను పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.
గుర్తు తెలియని దుండగులు కోతులను గొనె సంచిలో చౌడేనహళ్లి సమీపంలో రోడ్డు పక్కన పడేశారు. రోడ్డు పక్కన పడి ఉన్న ఈ సంచులను గుర్తించిన స్థానిక యువకులు వాటిని తెరిచి చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే బ్యాగులు తెరిచినప్పుడు… కొన్ని కదలలేని స్థితిలో ఉన్నాయి.. అయితే అవి కోన ఊపిరితో ఉన్నట్లు యువకులు చెప్పారు. ఇక ఇదే విషయంపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. జిల్లా పరిపాలన, అటవీ శాఖ ,జంతు సంక్షేమ బోర్డు అధికారులను ప్రతివాదులుగా కేసు దాఖలు చేయబడింది.
ఇదే తరహా సంఘటన.. ఈ సంవత్సరం జూలైలో హసన్ జిల్లాలోని బేలూరు తాలూకా చౌదనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. అప్పడు కూడా కనీసం 30 కోతులు చనిపోయాయి. అంతేకాదు 20 కోతులు గాయపడ్డాయి. అప్పుడు కూడా కోతులకు విషయం ఇచ్చి అనంతరం వాటికి కొట్టినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక 2020 నవంబరులో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో కూడా దాదాపు 50 కోతులు విషమిచ్చి చంపబడ్డాయి.
Also Read: 30 కోడిగుడ్లతో భారీ రోల్.. 20 నిమిషాల్లో తింటే రూ.20 వేలు బహుమతి.. ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా?