ముంబయిలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. స్థానికుల్లో భయాందోళన
దేశ వాణిజ్య రాజధాని ముంబయి(Mumbai) కంజుర్‌మార్గ్ లోని ఓ రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని

దేశ వాణిజ్య రాజధాని ముంబయి(Mumbai) కంజుర్‌మార్గ్ లోని ఓ రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. అపార్ట్‌మెంట్ నుంచి దట్టమైన పొగలు వస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. భవనంలోని 9,10వ అంతస్తుల్లో మంటలు(Fire) చెలరేగాయని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం అందిందని, వారి సమాచారంతో ఆరు అగ్నిమాపక యంత్రాలు, నాలుగు జంబో ట్యాంకర్లు, రెండు వాటర్ ట్యాంకర్లు, అంబులెన్స్ సహాయంతో ఘటనాస్థలానికి చేరుకున్నామన్నారు. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మంటలు కారణంగా భవనంలోని ఇతర అపార్ట్స్‌మెంట్‌లో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. ముందస్తు జాగ్రత్తగా భవనంలో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
గత నెలలో(జనవరి) కూడా ముంబైలో ఓ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇదే ప్రాంతంలోని మైదానంలో గడ్డికి మంటలు అంటుకున్నాయి. మెట్రో కార్ షెడ్ నిర్మించనున్న కంజుర్‌మార్గ్ బస్టాప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మేశాయి. మంటల వల్ల ఆ పరిసర ప్రాంతంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
#WATCH | Maharashtra: A level 2 fire breaks out in NG Royal Park area in Kanjurmarg of Mumbai. Around 10 fire tenders are present at the spot. Fire fighting operations are underway. pic.twitter.com/qUGk4j4Crd
— ANI (@ANI) February 28, 2022
Also Read
Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు
AP Assembly: మార్చి 7 తేదీ నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభం.. టీడీపీ హాజరయ్యేనా?



