మందుబాబులకు బంపర్ ఆఫర్.. ఓటు వేస్తే మద్యం బాటిళ్లపై భారీ డిస్కౌంట్.. అగ్గువకే బ్రాండ్లు..

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఇతర సామాజిక సేవా సంస్థలు రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ఓటు హక్కు- విలువపై ప్రజల్లో అవగాహన కలిగిస్తుంటాయి. అంతేకాకుండా.. కొన్ని సంస్థలు, హోటళ్ల నిర్వాహకులు ఆఫర్లను ప్రకటించడం లాంటివి కూడా మనం చూశాం..

మందుబాబులకు బంపర్ ఆఫర్.. ఓటు వేస్తే మద్యం బాటిళ్లపై భారీ డిస్కౌంట్.. అగ్గువకే బ్రాండ్లు..
Liquor Shop
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 06, 2024 | 12:58 PM

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఇతర సామాజిక సేవా సంస్థలు రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ఓటు హక్కు- విలువపై ప్రజల్లో అవగాహన కలిగిస్తుంటాయి. అంతేకాకుండా.. కొన్ని సంస్థలు, హోటళ్ల నిర్వాహకులు ఆఫర్లను ప్రకటించడం లాంటివి కూడా మనం చూశాం.. బెంగుళూరులో లాగా లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసి ఐడి చూపించిన వారికి చాలా రెస్టారెంట్లు ఉచిత అల్పాహారం ఇచ్చిన సందర్భాలను కూడా మనం చూశాం.. తాజాగా.. ఓటరు మహాశయులకు మరో బంపర్ ఆఫర్ కూడా వచ్చింది. హుబ్బళ్లిలోని ఓ బార్ యజమాని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్నంగా ముందడుగు వేశాడు. ఓటు వేసి ఐడీ చూపిస్తే మద్యం ధరపై రాయితీ ఇస్తామని ప్రకటించారు.

మంగళవారం మూడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.. కర్ణాటకలోని 14 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే తగిన అవగాహన కల్పించారు. అయితే, చాలాచోట్ల ప్రజలు ఓటు వేయడానికి విముఖత చూపుతున్నారు. దీంతో కర్ణాటకలో తొలి దశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. అందుకోసం హుబ్లీకి చెందిన ఓ బార్ ఓనర్ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నాడు.. ఓటు వేసి సిరా గుర్తుతోపాటు.. కార్డు చూపిస్తే మద్యం ధరపై రాయితీ ఇస్తానని ప్రకటించి వార్తల్లో నిలిచాడు..

ఎంత తగ్గింపు?

మంగళవారం జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ హక్కును వినియోగించుకోవాలి. హుబ్లీలోని కుసుగల్ రోడ్‌లోని కర్ణాటక వైన్స్ షాపు యజమాని ఓటు వేసి ఓటింగ్ ఐడీ చూపిస్తే మద్యం ధరలో 3% (మూడు శాతం) తగ్గింపు ఇస్తామని ప్రకటించారు. ఈ విషయమై బార్ ముందు బ్యానర్ కూడా పెట్టారు.

ఓటింగ్ రోజు మద్యం దొరుకుతుందా?

సాధారణంగా పోలింగ్ రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశిస్తారు. అందువల్ల పోలింగ్ రోజు మద్యం దొరుకుతుందనేది అనుమానమే. అయితే, తర్వాతకు ఓటరు ఐడీ చూపించి ఒక్కసారి తగ్గింపు ధరకు మద్యం కొనుగోలు చేయవచ్చు.

బెంగళూరులోని నృపతుంగ రోడ్‌లోని నిసర్గ గ్రాండ్ హోటల్ ఏప్రిల్ 26న వారి క్యాంపెయిన్‌లో భాగంగా.. ఓటర్ ఐడీ చూపించిన వారికి వెన్న దోసె, లడ్డూ, జ్యూస్ అందించింది. బెంగళూరులోని పలు హోటళ్లు ఇలాంటి చర్యలు చేపట్టాయి. దీన్ని హైకోర్టు కూడా అనుమతించింది. ఇప్పుడు మద్యం విక్రయదారులు కూడా అలాంటి చర్యలే తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..