Safest Cities Ranking: మన నగరాలు అంత సేఫ్‌ కాదా.. ప్రపంచ సేఫ్‌ సిటీస్‌ జాబితాలో మన సిటీలు ఎక్కడున్నాయో తెలుసా..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 02, 2021 | 9:00 PM

మన నగరాలు అంత సేఫ్‌ కాదా? ఢిల్లీ, ముంబై యమ డేజంరస్‌ అట. ప్రపంచ సేఫ్‌ సిటీస్‌ జాబితాలో అడుగున ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Safest Cities Ranking: మన నగరాలు అంత సేఫ్‌ కాదా.. ప్రపంచ సేఫ్‌ సిటీస్‌ జాబితాలో మన సిటీలు ఎక్కడున్నాయో తెలుసా..
Safest Cities Ranking

మన నగరాలు అంత సేఫ్‌ కాదా? ఢిల్లీ, ముంబై యమ డేజంరస్‌ అట. ప్రపంచ సేఫ్‌ సిటీస్‌ జాబితాలో అడుగున ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరాలు, ప్రమాదకర నగరాలు ఏవీ అనే అంశంపై ఓ సర్వే జరిగింది. లండన్‌కు చెందిన ది ఎకనామిస్టు గ్రూప్‌ వారి ఎకనామిస్టు ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ప్రపంచంలోని 60 మెట్రో నగరాలను తీసుకొని ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మన దేశానికి సంబంధించిన వరకూ ఆందోళన కలిగించే విషయాలే కనిపించాయి.. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ 48వ స్థానంలో నిలిస్తే, ముంబై 50వ స్థానంలో ఉంది. డిజిటల్ సెక్యూరిటీ, హెల్త్‌ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ, పర్సనల్‌ సెక్యూరిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ సెక్యూరిటీ అనే అంశాలను లెక్కలోకి తీసుకొని 100 మార్కులు కేటాయించారు. ఇందులో ఓవరాల్‌గా ఢిల్లీకి 56.1 పాయింట్లు దక్కితే.. ముంబైకి 54.4 పాయింట్లు వచ్చాయి.

ఇక పర్సనల్‌ సెక్యూరిటీ విషయానికి వస్తే ఢిల్లీ 52.8 పాయింట్స్‌తో 41వ స్థానంలో ఉంటే.. ముంబై 48 పాయింట్స్‌తో 50వ స్థానంలో ఉంది.. ఇది యావరేజ్‌ స్కోర్‌ అని ఇండెక్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.. ఇవి ఏమంత మెరుగైన స్కోర్లు కావని చెప్పక తప్పదు.. పర్సనల్‌ సెక్యూరిటీ విభాగంలో చివరి స్థానంలో అంటే అత్యంత ప్రమాకర నగరంగా పాకిస్తాన్‌లోని కరాచీ నగరం చిలిచింది.

మనీలా, బ్యాంకాక్‌, యాంగాన్‌, లాగోస్‌, ఢాకా, జకార్తా, బాకు, కైరో తదితర నగరాలన్నీ దిగువ స్థానాల్లోనే ఉన్నాయి. ఇక ప్రపంచంలోని టాప్‌ సేఫ్‌ సిటీస్‌లో డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ 82.4 పాయింట్స్‌తో మొదటి స్థానంలో నిలిచింది. కెనడా రాజధాని టోరంటో రెండో స్థానంలో ఉండగా సింగపూర్‌, సిడ్నీ, టోక్యో వరుసగా తర్వాత స్ధానాల్లో నిలిచాయి.

ఇవి కూడా చదవండి: Drones: అడవుల పెంపకం కోసం నయా ప్లాన్.. డ్రోన్ల సహాయంతో బృహత్తర కార్యక్రమం..

Dumba Goat Farm: ఈ గొర్రెల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్నారు.. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం.. పెంపకం ఎలానో తెలుసుకోండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu