AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అయోధ్య రామ మందిరంపై జీఎస్టీ వసూళ్లు..! ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు..

అయితే ఈ ఆలయ నిర్మాణాలకు సంబంధించిన ఆసక్తికర వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తాజాగా వెల్లడించారు. మహర్షి వాల్మీకి, శబరి, తులసీదాస్ ఆలయాలతో సహా 70 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 18 ఆలయాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికి 100శాతం పన్ను చెల్లిస్తామని... ఒక్క రూపాయి కూడా బకాయి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

Ayodhya: అయోధ్య రామ మందిరంపై జీఎస్టీ వసూళ్లు..! ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు..
Ayodhya Ram Mandir
Jyothi Gadda
|

Updated on: Sep 10, 2024 | 9:02 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం భారతదేశంలోని ప్రధాన పర్యాటక ప్రాంతంతో పాటు మతపరమైన నగరంలో చేరింది. రామ మందిరం కట్టినప్పటి నుంచి ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. రామ మందిరాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు వస్తున్నారు. ఆలయంలో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనుల ద్వారా జీఎస్‌టీ మొత్తం రూ.400 కోట్లు వస్తుందని చెప్పారు. ఇది ఒక అంచనా అయినప్పటికీ పనులు పూర్తయిన తర్వాతే అసలు పన్ను ఎంతన్నది తేలనుంది.

అయితే ఈ ఆలయ నిర్మాణాలకు సంబంధించిన ఆసక్తికర వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తాజాగా వెల్లడించారు. మహర్షి వాల్మీకి, శబరి, తులసీదాస్ ఆలయాలతో సహా 70 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 18 ఆలయాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికి 100శాతం పన్ను చెల్లిస్తామని… ఒక్క రూపాయి కూడా బకాయి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. అయోధ్యలో చేపడుతున్న ఆలయాల ద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్ల వరకు GST వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేసారు. పనులు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన పన్ను మొత్తం తెలుస్తుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

సంఘం సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది ఉండదు. గుడి నిర్మాణం విషయంలో జరిగిన ఉద్యమంలో చాలా మంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఉద్యమం వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన స్వాతంత్య్ర పోరాటం కంటే తక్కువేం కాదన్నారు. ఆలయ ప్రాంగణంలో శివాలయాన్ని కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న బకవా గ్రామం అద్భుతమైన శివలింగ నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివలింగ నిర్మాణానికి దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తాయి. రామమందిర ప్రాంగణంలో ప్రతిష్టించే శివలింగం కూడా ఇక్కడే రూపుదిద్దుకుంటోందని చంపత్ రాయ్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి