Watch: డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు.. చెప్పుతో కొట్టిన మహిళ..షాకింగ్‌ వీడియో వైరల్..!

డాక్టర్ గదిలోకి ఒకేసారి ఎక్కువ మంది వచ్చారు. వారిని బయటకు వెళ్లమని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ కోరారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఆ డాక్టర్‌ను చెప్పుతో కొట్టింది. దీంతో వైద్యులు ఆసుపత్రి మూసి వేసి ధర్నా చేశారు.

Watch: డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు.. చెప్పుతో కొట్టిన మహిళ..షాకింగ్‌ వీడియో వైరల్..!
Woman Slapped By Doctors
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 10, 2024 | 5:43 PM

సాధారణంగా డాక్టర్‌ అంటే కనిపించే దేవుడితో సమానం అని అంటూ ఉంటారు. ఎందుకంటే గుడిలోకి వెళ్లి కోరికలు కోరుకుంటే ఆ దేవుడు నెరవేరుస్తాడో లేదో తెలియదు. కానీ, ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళితే వైద్యులు ప్రాణాలను నిలబెడతారు అని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. అంతేకాదు..కరోనా సమయంలో డాక్టర్లు పడిన కష్టం అంతా ఇంతా కాదు..కంటికి కనిపించని వైరస్‌కి భయపడి అందరూ ఇంటిపట్టునే ఉంటే వైద్యులు మాత్రం కుటుంబ బాధ్యతలను సైతం వదిలేసి, వారిప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. అలాంటి వైద్యుల పట్ల కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే డాక్టర్లపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కర్ణాటకలో ఒక డాక్టర్‌పై ఒక పేషెంట్‌ బంధువులు దాడికి దిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్‌పై రోగి బంధువులు దాడి చేశారు. ఆస్పత్రికి వచ్చిన ఇర్షాద్ అనే పేషెంట్‌ను అతడి బంధువులు తీసుకొచ్చారు. డాక్టర్ గదిలోకి ఒకేసారి ఎక్కువ మంది వచ్చారు. వారిని బయటకు వెళ్లమని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేష్ కోరారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఆ డాక్టర్‌ను చెప్పుతో కొట్టింది. దీంతో వైద్యులు ఆసుపత్రి మూసి వేసి ధర్నా చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఇదిలా ఉంటే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. కొల్‌కత్తా డాక్టర్‌ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు ఆగ్రహించారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైద్యుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్‌పై రోగి బంధువులు దాడి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి