AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of makhanas: రోజూ గుప్పెడు ఫూల్ మఖానా తింటే.. ఇన్ని లాభాలా? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఫూల్ మఖానా..ఇప్పుడు దాదాపు అందరికీ తెలిసిన మంచి స్నాక్‌ ఐటమ్‌. వాస్తవానికి ఇవి తామర పువ్వుల నుంచి వచ్చిన గింజలు. వీటిని మన రోజువారి ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వీటిని ఎక్కువగా తింటారు. అసలు ఇంతకీ ఈ ఫూల్ మఖానా వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Sep 10, 2024 | 3:50 PM

Share
ఫూల్‌ మఖానా.. ఇవి చూసేందుకు గోధుమ, తెలుపు రంగులో ఉంటాయి. తామర గింజల్లో యాంటీ ఆక్సీడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవటం వలన గుండెకు సంబంధించిన జబ్బులు దూరం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ఐరన్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం వంటి పోషకాలు మఖానాలో పుష్కలంగా భిస్తాయి. ఇన్ని పోషకాలతో నిండిన మఖానా ఒక సూపర్ ఫుడ్ అని చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

2 / 5
మఖానాలో ఉండే ప్రొటీన్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది. మఖానాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. మఖానా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది.

3 / 5
ఆందోళన, నిద్రలేమి, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలతో బాధ పడే వారు మఖానా తినాలని చెబుతున్నారు. రాత్రుళ్లు బాగా నిద్రపట్టాలంటే..రాత్రిపూట గ్లాసెడు పాలు, గుప్పెడు ఈ ఫూల్ మఖానా తింటే మంచి నిద్ర పడుతుందని నిపుణులు వెల్లడించారు.

4 / 5
మఖానా చర్మ సంరక్షణకు కూడా ఉత్తమమైనది. దీంతో ముఖంపై ముడతలు తొలగిపోతాయి. మఖానాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లలో గాలిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.

5 / 5