- Telugu News Photo Gallery Aloe Vera Vs Amla Which is better for hair? check here is details in Telugu
Aloe Vera vs Amla: అలోవెరా Vs ఉసిరి.. ఈ రెండింటిలో తల జుట్టుకు ఏది మంచిది?
జుట్టు మెత్తగా, మెరుస్తూ, ఒత్తుగా ఉంటే ఆ అందమే వేరు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా చెప్పే విషయాల్లో జుట్టు రాలే సమస్య ఒకటి. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వలన జుట్టు రాలుతుంది వస్తాయి. చాలా మంది ఎక్కువగా మార్కెట్లో లభ్యమయ్యే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మరికొంత మంది హోమ్ రెమిడీస్ ఫాలో చేస్తూ ఉంటారు. జుట్టును బలంగా, దృఢంగా ఉంచే వాటిల్లో..
Updated on: Sep 10, 2024 | 5:07 PM

జుట్టు మెత్తగా, మెరుస్తూ, ఒత్తుగా ఉంటే ఆ అందమే వేరు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా చెప్పే విషయాల్లో జుట్టు రాలే సమస్య ఒకటి. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వలన జుట్టు రాలుతుంది వస్తాయి.

చాలా మంది ఎక్కువగా మార్కెట్లో లభ్యమయ్యే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మరికొంత మంది హోమ్ రెమిడీస్ ఫాలో చేస్తూ ఉంటారు. జుట్టును బలంగా, దృఢంగా ఉంచే వాటిల్లో అలోవెరా, ఉసిరి కూడా ఒకటి. మరి జుట్టుకు ఉపయోగించడంలో వీటిల్లో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి, అలోవెరా రెండూ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. స్కాల్ఫ్ మంటను తగ్గించడంలో ఉపయోగ పడతాయి. అలోవెరా జుట్టును సాఫ్ట్‌గా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి. జుట్టుపై ఉండే చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. అలోవెరా ఉపయోగిస్తే తలపై ర్యాషెస్, మంట తగ్గుతాయి.

జుట్టును రాకుండా ఉండేలా చేయడంలో ఉసిరి చాలా బెస్ట్. ఉసిరి వాడటం వల్ల హెయిర్ మెరుస్తూ.. సాఫ్ట్‌గా ఉంటాయి. కేశాల కుదుళ్లు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తాయి. జుట్టు విరగకుండా చేస్తుంది. అలాగే తలపై దురద, డాండ్రఫ్‌ను కూడా తగ్గిస్తాయి.

జుట్టు చక్కగా బలంగా ఉండి ఎదగాలంటే ఉసిరి బెస్ట్. హెయిర్ మెరుస్తూ.. మృదువుగా ఉండాలంటే అలోవెరా ఉపయోగించవచ్చు. కేశాలకు ఏది అవసరమో దాని బట్టి వినియోగించాలి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




