భారత్‌లో నవరాత్రులకోసం హిల్సా చేపలు.. పంపేది లేదని తేల్చి చెప్పిన బంగ్లాదేశ్..!
మన గోదావరి పులసలాగానే బంగ్లాదేశ్ లో హిల్సా బాగా ఫేమస్. దీనిని హిల్సా లేదా టెనులోసా, ఇలిషా, పద్మా పులస అని కూడా అంటారు. బంగ్లాదేశ్ లోని పద్మా నదిలో పుట్టే చేపలు కాబట్టే వీటికి పద్మా పులస అనే పేరొచ్చింది. ఇది పశ్చిమబెంగాల్ కి వచ్చే సరికి హిల్సాగా మారిపోతుంది.
పశ్చిమ బెంగాల్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి చోటా మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలు ఉంచి పూజిస్తారు. ఆ తర్వాత నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతుంది. నవరాత్రుల సందర్భంగా బెంగాల్ లో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసి అతిథులకు వడ్డిస్తుంటారు. పండగ అంటే మనకు పిండి వంటకాలే, కానీ, బెంగాల్ లో నవరాత్రులు అంటే హిల్సా చేప ఉండాల్సిందే. ఈ హిల్సా చేప ప్రత్యేకంగా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ ఏడాది బెంగాల్ ప్రజలకు హిల్సా చేపలు దక్కేలా లేదు. దుర్గాపూజ సందర్భంగా భారతదేశానికి హిల్సా చేపలను ఎగుమతి చేయడాన్ని బంగ్లాదేశ్ నిషేధించింది.
ఈ ఏడాది దుర్గాపూజ సందర్భంగా హిల్సా చేపలను భారత్‌కు ఎగుమతి చేయబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చేప బెంగాల్ ప్రజలకు చాలా ఇష్టం. దుర్గాదేవి పూజ సమయంలో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఈ చేపను దుర్గామాతకు నైవేధ్యంగా కూడా సమర్పిస్తారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని హిల్సా చేపలలో 70-80శాతం బంగ్లాదేశ్‌లో ఉత్పత్తి అవుతుంది. ఇటీవలి సంవత్సరాలలో బంగ్లాదేశ్ దుర్గా పూజ సమయంలో హిల్సాను భారతదేశానికి పంపింది. ఈ ఏడాది నిషేధం విధించడం వల్ల బెంగాల్‌లో హిల్సా చేపల ధరలు ఆకాశాన్నంటనున్నాయంటున్నారు వ్యాపారులు, ప్రజలు.
బెంగాలీల అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన దుర్గాపూజ సమయంలో హిల్సా చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పూజా ఆచారాల సమయంలో ప్రజలు ఈ చేపను దుర్గాదేవికి సమర్పిస్తారు. సాంప్రదాయకంగా హిల్సా తినడానికి సీజన్ చివరి రోజు దశమి. అయితే, బంగ్లాదేశ్ నుంచి హిల్సా రాకపోతే ఒడిశా, మయన్మార్, గుజరాత్ లపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న హిల్సా ధర ఢిల్లీలో కిలో రూ.2200-2400గా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
హిల్సా చేప అంటే ఏమిటి?
మన గోదావరి పులసలాగానే బంగ్లాదేశ్ లో హిల్సా బాగా ఫేమస్. దీనిని హిల్సా లేదా టెనులోసా, ఇలిషా, పద్మా పులస అని కూడా అంటారు. బంగ్లాదేశ్ లోని పద్మా నదిలో పుట్టే చేపలు కాబట్టే వీటికి పద్మా పులస అనే పేరొచ్చింది. ఇది పశ్చిమబెంగాల్ కి వచ్చే సరికి హిల్సాగా మారిపోతుంది. కోల్ కత మార్కెట్ లో ఈ చేప కేజీ వెయ్యి రూపాయలు ధర పలుకుతుంది. రేటు ఎక్కువగా ఉన్నా కూడా నవరాత్రులలో ఆ రుచి లేకుండా బెంగాల్ ప్రజలకు ముద్ద దిగదు. ఇది తన జీవితంలో ఎక్కువ భాగం సముద్రంలో గడుపుతుంది. కానీ, వర్షాకాలంలో నది ముఖద్వారాలకు వలసపోతుంది. బంగాళాఖాతంలో నదులు కలిసే ప్రదేశం ఇది. దీని తరువాత అది నదిలో పైకి వెళ్లి గుడ్లు పెడుతుంది. దాని పిల్లలు సముద్రంలోకి వెళ్లి పెరుగుతారు. ఇది సముద్రం, నది నీటిలో సంచరిస్తుంది కాబట్టి.. హిల్సా రుచి అద్భుతంగా ఉంటుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
హిల్సా చేపల సంతానోత్పత్తి సమయం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ కాలంలో దానిని పట్టుకోవడంపై నిషేధం ఉంది. మత్స్యకారులు నికర పరిమాణంపై పరిమితులను విస్మరించి వీలైనంత ఎక్కువ చేపలను పట్టుకుంటారు. వారు 300-400 గ్రాముల వరకు బరువున్న పెద్ద చేపలను కూడా పట్టుకుంటారు. ఇది వాటిని పెరుగుదల, పునరుత్పత్తికి అవకాశం లేకుండా పోతుందని చెబుతున్నారు. సీజన్‌లో చేపల సంఖ్య తగ్గడానికి ఇదే కారణం అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..