AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తాగిన మైకంలో అద్దంలో చూసుకుని ఖంగుతిన్న పెద్దాయన..! ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే అవాక్కే..

తాగిన వ్యక్తి తన నీడతో అవస్థలు పడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వృద్ధుడు అద్దంలో చూసుకుంటూ మాట్లాడుతున్న తీరును చూడటం చాలా ఫన్నీగా ఉంది. వీడియో చూసిన చాలా మంది దీనిపై స్పందించారు. ప్రతి ఒక్కరూ ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

Viral Video: తాగిన మైకంలో అద్దంలో చూసుకుని ఖంగుతిన్న పెద్దాయన..! ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే అవాక్కే..
Drunk Man
Jyothi Gadda
|

Updated on: Sep 10, 2024 | 5:12 PM

Share

ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏం చేస్తుంటాడో తనకే తెలియదు. కొన్నిసార్లు మందుబాబులు చేసే పనులు ఎదుటి వారికి ప్రమాదంగా మారుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో తాగుబోతులు చేసే చిత్ర విచిత్రమైన పనులు చూసేవారికి వినోదాన్ని పంచుతాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.. ఓ వృద్ధుడు ఫుటుగా తాగేసి ఊగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుల్ సైజు అద్దం ముందు నిలబడి ఉన్న అతడు..ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎదురుగా కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసి అతడు షాక్‌ అవుతాడు.. ఎవరో వ్యక్తి తనను అనుకరిస్తున్నాడని భావించి అతనితో మాట్లాడటం మొదలుపెడతాడు.

వీడియోలో కనిపించే పెద్దాయన తాగిన మైకంలో అచ్చం అమితాబ్ బచ్చన్‌ను ఇమిటేట్‌ చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో అమితాబ్ బచ్చన్ యాక్షన్‌ సీన్‌ ఒకటి తనకు నాకు చాలా ఇష్టమైనది. తాగి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో సందడి చూస్తుంటే.. అదేదో పార్టీలా ఉంది. అక్కడున్న వారంతా ఎవరి మాటల్లో వారు బిజీగా ఉన్నారు. చుట్టూ మ్యూజిక్‌ సౌండ్స్‌ పెద్ద పెద్దగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ పెద్దాయన నడుస్తూ వెళ్లి ఒక నిలువు అద్దానికి ఢీకొన్నాడు. ఆ తర్వాత అతను అద్దంలో కనిపించే తన రూపాన్ని చూసి తనతో మాట్లాడుతున్నాడు. ఎందుకిలా అడ్డంగా వచ్చావు, వెళ్ళిపో అంటున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి ఆ అద్దంలోంచి అదే రియాక్షన్‌ వస్తుంది. దీంతో ఆ తాగివున్న పెద్దాయకు కోపం వస్తుంది. వెంటనే అతన్ని పక్కకు నెట్టడం ప్రారంభిస్తాడు. కానీ, ఫలితం ఉండదు. ఇదంతా అక్కడే ఉన్న ఎవరో వీడియో తీశారు. ఇప్పుడు అదే వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూడండి..

తాగిన వ్యక్తి తన నీడతో అవస్థలు పడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వృద్ధుడు అద్దంలో చూసుకుంటూ మాట్లాడుతున్న తీరును చూడటం చాలా ఫన్నీగా ఉంది. వీడియో చూసిన చాలా మంది దీనిపై స్పందించారు. ప్రతి ఒక్కరూ ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ వాడొచ్చా..? ఎలాగో తెలుసుకోండి
ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ వాడొచ్చా..? ఎలాగో తెలుసుకోండి
మంచు మనోజ్ సినిమాలో ఉక్రెయిన్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
మంచు మనోజ్ సినిమాలో ఉక్రెయిన్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
రూ.39 ప్లాన్‌లో రోజుకు 3GB డేటా.. చౌకైన డేటా ప్లాన్స్‌!
రూ.39 ప్లాన్‌లో రోజుకు 3GB డేటా.. చౌకైన డేటా ప్లాన్స్‌!
ఆర్గానిక్ పెళ్లి చూసి ఆశ్చర్యపోయిన అతిథులు..!
ఆర్గానిక్ పెళ్లి చూసి ఆశ్చర్యపోయిన అతిథులు..!
ఆదివారం జన్మించారా...? మీ అదృష్ట సంఖ్య, విజయ రహస్యాలు తెలుసుకోండి
ఆదివారం జన్మించారా...? మీ అదృష్ట సంఖ్య, విజయ రహస్యాలు తెలుసుకోండి
బైక్‌లకు డీజిల్‌ ఇంజన్లు ఎందుకు ఉండవు..? అసలు రహస్యం ఇదే!
బైక్‌లకు డీజిల్‌ ఇంజన్లు ఎందుకు ఉండవు..? అసలు రహస్యం ఇదే!
విదురుడు చెప్పినట్లు చేస్తే.. మీకు జీవితంలో తిరుగుండదు..!
విదురుడు చెప్పినట్లు చేస్తే.. మీకు జీవితంలో తిరుగుండదు..!
విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. అభిమానులకు కీలక సూచన
విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. అభిమానులకు కీలక సూచన
ఇంట్లో ఒంటరిగా రక్తపు మడుగులో 90 ఏళ్ల వృద్ధురాలు!
ఇంట్లో ఒంటరిగా రక్తపు మడుగులో 90 ఏళ్ల వృద్ధురాలు!
మీ రాశికి ఈ రంగులు సరిపోవు.. వేసుకున్నారంటే అదృష్టం తిరగబడుద్ది..
మీ రాశికి ఈ రంగులు సరిపోవు.. వేసుకున్నారంటే అదృష్టం తిరగబడుద్ది..