ఈ మూడింటి కలయిక ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ చూర్ణం తీసుకుంటే..

ఆయుర్వేదంలో అనేక తీవ్రమైన వ్యాధుల చికిత్సలో సహాయపడే ఎన్నో మందులు ఉన్నాయి. అందులో ఒకటి త్రిఫల. దీని పొడి కడుపుకు వరంలాంటిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. త్రిఫల పొడిని ఎంతో కాలంగా ఆయుర్వేదంలో హెర్బ్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మలబద్దకానికి దివ్యౌషధం. బరువు తగ్గడంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది. త్రిఫల చూర్ణం మరిన్ని ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Sep 09, 2024 | 10:00 PM

త్రిఫల చూర్ణం ఎంతో కాలంగా ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకాన్ని నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.   ఇది కడుపు లోపలి పొరను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సహజ భేదిమందులు, ఫైబర్ జీర్ణక్రియ ఏజెంట్లుగా పనిచేస్తుంది.  మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

1 / 5
కడుపు, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి త్రిఫల పొడి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది మీ బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక నివేదిక ప్రకారం త్రిఫల చూర్ణం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు కణాలను క్యాన్సర్ కణాలను పెరగకుండా నివారిస్తుంది.

2 / 5
త్రిఫల ఒక మూలికా ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఏదైనా ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో, పోరాడడంలో సహాయపడుతుంది. త్రిఫల శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

3 / 5
త్రిఫల పొడి చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది . ఇది మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
త్రిఫల చూర్ణం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. త్రిఫల నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది యాంట్ డయాబెటిక్ గా పనిచేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా ఇన్ల్ఫమేషన్ రాకుండా కాపాడుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది.

5 / 5
Follow us