22 అంతస్తుల ఎత్తైన టవర్..15 సెకన్లలో నేలమట్టం..షాకింగ్ వీడియో వైరల్
టవర్ సెకన్లలో కూలిపోయిన తర్వాత అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. కూల్చివేత మాత్రం 15 సెకన్లలో జరిగిపోయింది. భవనం కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళి కమ్మేసింది. దాదాపు ఐదు అంతస్తుల ఎత్తులో రాళ్ల కుప్ప మిగిలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక నది ఒడ్డున ఉన్న అందమైన 22 అంతస్తుల భవనం 15 సెకన్లలో బూడిద కుప్పగా మారింది. భవనంపై బాంబు దాడి జరిగింది. అయితే తమ నగరంలో ఒక అందమైన వస్తువును ఇలా నేలమట్టం చేయడం చూసి అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. భవనం కూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవును, ఈ షాకింగ్ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని ఓ నగరంలో ఎంతో అందమైన సుందర భవనం బాంబుల పేల్చి బూడిద కుప్పలా మార్చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలో 22 అంతస్తుల టవర్‌ను సెకన్ల వ్యవధిలో కూల్చేశారు. టవర్ సెకన్లలో కూలిపోయిన తర్వాత అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. కూల్చివేత మాత్రం 15 సెకన్లలో జరిగిపోయింది. భవనం కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళి కమ్మేసింది. దాదాపు ఐదు అంతస్తుల ఎత్తులో రాళ్ల కుప్ప మిగిలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియో చూడండి..
The Hertz Tower implosion
Safety & travel info: https://t.co/Bgr93vDuuM pic.twitter.com/rDMTvP2r2O
— Kathryn Shea Duncan (@kat_dunc) September 7, 2024
గత 40ఏళ్లుగా, ఈ భవనం ప్రజల ఆకర్షణకు కేంద్రంగా ఉండేది. నగరానికి ఇది ఐకానిక్ భవనంగా నిలిచి ఉంది. అయితే గత నాలుగేళ్లుగా ఈ భవనం మూసివేసి ఉంది. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో ఈ భవనం ఇప్పుడు హాంటెడ్ బిల్డింగ్‌గా మారింది. మనుషులు కాదు కదా.. ఈ భవనంలో పక్షులు కూడా కనిపించకుండా పోయింది. గతంలో క్యాపిటల్ వన్ టవర్ అని పిలిచే ఈ భవనం లారా, డెల్టా తుఫానుల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. భవనం యజమానులు మరమ్మతు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..